ఏనుగుపై వాలిన దోమలు గా అభివర్ణించేవారు. అంత సూక్ష్మాతి సూక్ష్మమైనవి ఆ లీలలు అనేవారు "లీలలను అతిశయోక్తులుగా వర్ణించి చెపుతారీకవులు. ప్రవాహం పట్ల మాత్రమే కాని ప్రవాహం యొక్క మూలంపై శ్రద్ధ లేదు వీరికి.
(శ్రీ.స. స.పు. 405)
శ్రీకృష్ణుడు తానవతార పురుషుడనన్న సంగతిని తన లీలల ద్వారా క్రమక్రమంగా వెల్లడి చేశాడు. అన్ని అవతారాల్లోనూ, యిలానే జరిగింది.
జనం వాస్తవాన్నెంత గ్రహిస్తున్నారూ, ఆమోదిస్తున్నారు అనేది కూడా ఆయన ఎప్పటికప్పుడు చూచుకొంటూ వుండేవాడు.
తన అవతార తత్వాన్ని ప్రజలకు తెలియజేయటానికి ఆయన అనేక లీలలు చేశాడు. ఆయన లీలలన్ని మానవ మాత్రులకు అసాధ్యమైన అద్భుతాలే! నా డే కాదు, నేడు అంతే!
(శ్రీసా.గీ.పు.19/20)