హిరణ్యగర్భుడు ప్రతి మానవుని హృదయమునందున్నాడు. కేవలం మానవుని యందే కాదు, పశుపక్షి మృగాదులందు కూడా ఉన్నాడు. కనుకనే వేదము "ఈశావాస్య మిదం జగత్" "ఈశ్వర సర్వ భూతానాం" అన్నది. ఈ హిరణ్య గర్గుని నుండి వచ్చునదే ప్రేమ. ప్రేమ హిరణ్యగర్చుని ప్రతిబింబమే. ప్రేమ హిరణ్యగర్భుని ప్రతిరూపమే. ఇదే మానవుని స్వస్వరూపము. ఇట్టి స్వస్వరూపాన్ని గుర్తించుకోలేక మానవుడు అనిత్యమైన లోక సంబంధమైన వాంఛలకు తన జీవితాన్ని అంకితం గావించు కుంటున్నాడు. స్వార్థపరమైన ప్రేమ వదలిపోతుంది. మరిచి పోతుందిగాని భగవత్ ప్రేమ వదలేది కాదు. విడిచేది కాదు. మరచేది కాదు. మారిపోయేది కాదు, పారిపోయేది కాదు, జారిపోయేది కాదు. అట్టి దివ్యమైన ప్రేమతత్త్వం మానవునికి అత్యవసరం.
(స. సా.మా99.పు.68)
(చూ॥ ప్రధమజా, ప్రశ్నోపనిషత్తు, బంగారు, హిరణ్య గర్భతత్త్వం)