ఒక ప్రయత్నమున సాధకునకు ఓటమి కలిగిన అట్టి ఓటమి ఏ కారణమువల్ల కలిగినది అని విమర్శించు కొనవలెను. తరువాత, రెండవ విషయమందు ఆకారణమును జాగ్రత్తగా చూచుకొనవలెను. అపజయము కలిగించిన కారణమును జాగరూకతతో గమనించి నిన్ను నీవు కాపాడుకొనుటకు ప్రయత్నించవలెను. తిరిగి అట్టి కారణమునకు చిక్కుకొనక, లొంగక ఉండవలెను. ఇట్టి విషయమునందు మాత్రము సాధకుడు ఉడుతవలె చురుకుదనమును కలిగియుండవలెను. చురుకుతనముతోపాటు తెలివి సమర్థత కూడా కలిగి, తప్పులు చేయకుండుటకు ప్రయత్నించవలెను. ఇదియును శాంతి సహాయముననే ప్రాప్తించును.(ప్ర. వా. పు. 16)
బ్రూసు మహాశయుడు సాలెపురుగువల్ల నీతి నేర్చుకొని, ఏడుసార్లు తాను యుద్ధమందు అపజయమును పొంది, శాంతి ప్రభావముతో ఎనిమిదవసారి గెలిచెను.(ప్ర. వా. పు.14)