హర్రీ (తొందరపాటు), వర్రీ (చింత), కర్రీ (క్రొవ్వు పదార్థం) -ఈ మూడు అనేక రోగాలకు కారణమవుతాయి. ఓర్పు చాల ప్రధానం. షిర్డి అవతారంలో కూడా శ్రద్ధ, సబూరి (ఓర్పు, ముఖ్యమైనవని చెప్పటం జరిగింది. బస్టాండ్ లోను, సినిమా హాలులోనూ మీరు ఎంత సేపైనా క్యూ లో నిలబడతారు. కానీ, ఇక్కడ స్వామి దర్శనం ఇంకా కాలేదా అనుకుంటారు. అర్జునుడు కృష్ణునితో ఎంతో స్నేహంగా ఉన్నా అతనికి 74వ సంవత్సరం వచ్చేదాకా గీతాబోధ జరుగలేదు. మీరు కూడా స్వామి నాతో మాట్లాడలేదే" అనుకోకూడదు. దేనికైనా తగిన సమయం రావాలి. చూడండి - పండు పక్వం కాగానే చెట్టు నుండి రాలిపోతుంది. కానీ, అంతదాకా ఆగాలి కదా!(స. సా.మే.99పు 139)
(చూ|| నరుడు)