మీలో ఎవరికైనా స్వామి సాక్షాత్తు దైవమున్న ప్రజ్ఞ అసలున్నదా అని! ఆ అవగాహనే మీలో నిజంగా ఉన్నట్లైతే అదే మేడ పైన ఉంటున్నది దైవమని గుర్తించి, భక్తి శ్రద్ధలతో గప్ చిప్ మని నిశ్శబ్దముగా కూర్చొని, ధ్యానమో, జపమో చేస్తూ ఉండేవారు! ఇలా ఊకదంపుడు కబుర్లు, మీ ఇంటి విషయాలు, స్వంత వ్యవహారములు చెప్పుకొంటూకాలమును వ్యర్థము చేస్తున్నారే! ప్రజల సొమ్మును వాడి మీ కొరకేమైనా చావడిగాని రచ్చబండగాని కట్టి పెట్టనా నేను? ఏదో ఆర్గనైజేషన్ విషయములను చర్చించినట్లేతే ఫరవాలేదు. జపధ్యానాదులను చేయువారికే ఇచ్చట ప్రవేశార్హత ఉన్నది. ఇదేమైనా క్లబ్బా!? సామాన్య గృహస్థు ఇల్లా? దైవము నివసించు దేవాలయమెలా ఉండాలి? దైవమందిరములో ఎలా ప్రవర్తించాలో మీకు తెలియదా? ఆయినా మీరెవరు? స్వామి ఆర్గనైజేషన్ లో సభ్యులు! ప్రధాన కార్యకర్తలు! మీరు ఇతర భక్తులకు Examples గా (ఉదాహరణములు, ఆదర్శప్రాయముగా) ఉండవద్దా! మీలోనే భయము భక్తి, వినయ విధేయతలు లేనప్పుడు, మీరు ఇతర వ్యక్తులతో నా దైవత్వము గురించి ప్రగల్భములు పలుకుట హాస్యాస్పదముగా లేదా? అది హిపోక్రసీ ఆత్మవంచన కాదా?ఏదో మీరు ఆర్గనైజేషన్ లో ప్రధాన కార్యకర్తలు కదాయని మిగిలిన "డివోటిస్ (భక్తులు) వలె కాక మీకు స్పెషల్ గా ఈ మందిరములోనికి ప్రవేశార్హత నొసగుటే పెద్ద తప్పు, స్వామి చేసిన పెద్ద తప్పు!
(లీ. వా.పు.60)