నేటి అధ్యాపకులు, విద్యార్థులు మితభాషను, హితభాషను అభ్యసించటం అత్యవసరమని గుర్తించాలి. అతి భాష మతిహాని, మితభాష అతి హాయి. ఏ విషయంలోనూ అతి పనికి రాదు. అతి అరిష్టానికి దారితీస్తుంది. మితంగా మాట్లాడే వారిని గౌరవిస్తారు. అంతేకాదు హితంగా మాట్లాడేవారిని మరింత గౌరవిస్తారు. కనుక మితంగా, హితంగా మాట్లాడటం నేర్చుకోవాలి..
(శ్రీవా. జూ - 97 పు. 99)