అభిరుచులు ఎట్టివైనను సరే వారి వారి అవధానము నడుపజాలినదై యుండును. అభిరుచియందు అవధానమును ప్రోత్సహించు శక్తి యుండును. అభిరుచి యనునది. గుప్తరూపముననున్న అవధానమనియు, అవధానము క్రియా రూపముననున్న అభిరుచి అనియు అందురు. అభిరుచి లేకున్నచో అవధానము చక్కగా నవడువజాలదు. ఈ రెండింటికిని వాగర్ధములవలె విడరాని సంబంధము. అవధానము యొక్క వృద్ధి క్షయములు అభిరుచి యొక్క వృద్ధిక్షయములమీద అధారపడి యుండును. వీటన్నింటికి ఏకాగ్రత ముఖ్యము. ఏకాగ్రత జన్మస్థానమే ధ్యానము.
(ధ్యావా.పు.19)