సముద్రం నుంచి రత్నాలు గ్రహించదలచుకున్నవారు లోతుకు దిగి మునిగి వాటిని సేకరించాలి. ఒడ్డున నిలబడి లోతుకు పోకుండ సముద్రములో రత్నాలు లేవని, వాటిని గురించి విషయాలన్నీ అభూతకల్పనలని చాటించటం వల్ల లాభం లేదు. అల్లాగే అవతారమూర్తి ప్రేమానురాగాలు పొందగోరినవారు సాయితత్త్వం గాడంగా అవగాహన చేసుకోవాలి. అందులో తలమునకలుగా తేలినప్పుడే నాతో ఏకీభావం పొందగలరు. నన్ను తమ హృదయాంతరాళాలలో స్థాపించుకోగలరు.
(స.ప్ర.పు.2)