అరిషడ్వర్గములు

మానవుడు తనలోని అరిషడ్వర్గములనే (కామ, క్రోధ, లోభ,మోహ, మద, మాత్పర్యము) పశువులను సంహరించి తన పరిశుద్ధాత్మనువిశ్వేశ్వరునకు సమర్పించుట అనేదే ధర్మము. (ధపు 4)

 

పండులా వుండు. చేదుగా యున్నదాని తోలును తీసిపారవెయ్యి. లోపల

తియ్యటి రసాన్ని త్రాగి అనుభవించు - అరిషడ్వర్గాలు అనే తోలును తీసిన

తరువాత మిగిలేది నేనే. తియ్యటి రసమే నేనన్న ప్రేమ రూపుడను. త్రాగి

అనుభవించు.. (సా! పు 469)

 

శ్లో! ధ్యా య తో వి ష యాన్ పుం స :సంగ స్త్ షూ ప జా యా తే

సం గా త్ సంజాయా తే కామ : కామాత్ క్రోధాభిజాయతే

శ్లో! క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహ త్ స్మృతి విభ్రమః

స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి

శ్లో! విహాయ కామాన్య స్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః

నిర్మమో నిరహంకారః స్స శాన్తి మధిగచ్చతి

(భ.గీ. పు. 2-62, 63, 71)

 

అరిషడ్వర్గములలో మొట్టమొదటివి - కామక్రోధములు. మానవునకు కామ,క్రోధములు అని రెండు పదములు ఉండినప్పటికిని మొదటి పదము యొక్కపరిణామమే రెండవ పదము లోభ, మోహ, మద, మాత్సర్యములు. మొదటి పదముయొక్క పరిణామములే. అరిషడ్వర్గములనగా కామము యొక్క పరిణామము.కామము యొక్క పరివర్తనే వీటి యొక్క స్వరూప స్వభావములకు మూల కారణము.కామము వల్ల ఆపేక్ష పెరుగుచున్నది. ఈ అపేక్ష ఫలించకుండిన అనగావిఫలమైనచో అది క్రోధముగా మారుచున్నది. ఈ క్రోధమే సమ్మోహనంగాతిరుగుచున్నది. ఈ సమ్మోహనమే కడపటికి పెరిగి పెరిగి స్మృతి భ్రష్టునిగావించుచున్నది. ఈ స్మృతి భ్రష్టుడే కష్టము వల్ల బుద్ధి క్షీణతపొందుచున్నాడు. ఈ బుద్ధి నాశనము వలన సర్వమూ నాశనమగుచున్నది.సర్వదు:ఖములకు, సర్వ నాశనమునకు, అపకీర్తికి ఈ కామమే మూలకారణము. మనము వాంఛలను తగినంత అదుపులో ఉంచుకొని తగినరీతిగా జీవించటానికిప్రయత్నించాలి.

 

సర్ప మింటియందు సంచరించుచుండ

ఎవరు సుఖనిద్ర చెందగలరు?

విషయసర్ప ముండు విషమయ దేహాన

జీవయాత్ర దేహి సల్పుచుండ

కోపము కలిగిన వానికి

ఏపనియు ఫలింపకుండ ఎగ్గులు కలుగునో

పాపము పనులనే చేయుచు

ఛీ పొమ్మనిపించు కొనుట చేకూరును సుమీ.

సాధనలు చేసి ఫల మేమి శమము లేక

యోగములు పూని ఫలమేమి ఓర్పులేక

జపము లొనరించి ఫలమేమి శాంతి లేక.

చవిటి భూమిని దున్నిన సరళి కాదె

 

విషయములు ధ్యానించు వానికి వాటియందు ఆసక్తి కలుగును. అట్టివిషయాసక్తి వలన కోరిక, కోరిక వలన కోపము కలుగును. కోపము వలన అవివేకము,అవివేకము వలన స్మరణ భ్రంశము కలుగును. స్మరణ జ్ఞానము పోవుట వలన బుద్ధినశించును. బుద్ధి నశించిన తోడనే తానే నశించును. కాన, విషయచింతన యుండరాదు.

 

ఎవడు సమస్త కోరికలను, శబ్దాది విషయములను త్యజించి వాని యం దేమాత్రము ఆశ లేక, అహంకార మమకార వర్జితుడై ప్రవర్తించునో అట్టివాడేశాంతిని పొందుచున్నాడు.

కోరు కోరికలన్నియు తీరుచున్న

భక్తి దైవము హెచ్చు. రక్తి హెచ్చు

కోరు కోరిక లెవ్వేని తీరకున్న

భక్తి తరుగుచు. దైవ విరక్తి పెరుగు.

(శ్రీ భ. ఉ.పు.12/13)

 

ప్ర . మము క్షత్వ నకు  ముందడుగు వేయకుండఅడ్డువచ్చు చెడ్డ గుణములేవి ?

ఉ. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములనెడి అరిషడ్వర్గములే.

 

ప్ర. కామమనగా నేమి? 

ఉ. ధనధాన్యాదులయందు, వస్తు వాహనాదులయందు, పుత్ర పౌత్రాదుల యందు, వేయేల? అసత్య, అనిత్య, అశాశ్వత, అశుద్ధమైన ప్రాపంచికవాంఛలను కలిగియుండుటయే. 

 

ప్ర. క్రోధమనగా నేమి? 

ఉ. ఎల్లప్పుడు, ఇతరులను చెరపుటకు తీవ్రమైన దీక్షను పూనియుండుట.

 

ప్ర. లోభమనగా నెట్టిది? 

ఉ . తాను ఆర్జించిన ధనమునుండి చిల్లిగవ్వయైనను ఇతరులకు చేరకూడదని పట్టుపట్టుటయే కాక తాను కూడను ఎట్టి అవసర సమయమందైనను ఆ ధనమును అనుభవించకుండుట. ఇట్టి స్థితినే లో భమని అందురు.

 

ప్ర. మోహమనగా నేమి? 

ఉ. తనవారలయందు అధికమగు ప్రీతియుంచి తనకున్న వస్తు వాహనములు చాలవని, అధిక ధనమును ఆర్జించవలెనని ఆశ గలిగి యుండుట.

 

ప్ర. ఇక మదమనగా నేమి? 

ఉ. ద్రవ్యమధికమగుటచేత, విద్యా బలము, దేహబలము ఉండుటచేత,ఇతరులను లక్ష్యము చేయక సంచరించుటయే మదమనబడును. ఇంతియే కాక పై ధన, దేహ, విద్యాబలములు లేనప్పటికినీ ఇతరులను బెదిరించి విచ్చలవిడిగా తన సుఖములు అనుభవించుచు పెద్ద, చిన్న యను తారతమ్యమును గుర్తించక ఆయా సమయమునకు తన సుఖమును మాత్రమే కోరునట్టి స్వార్థపరులను కూడను మదస్వభావులందురు. 

 

ప్ర.    మత్స రమనగా నేమి?

ఉ. తనవలె ఇతరులు సుఖసంతోషములు అనుభవించుచున్న చూచి, విని సహించుకొనకుండుటయే మత్సరమనబడును.

 

ప్ర. డంబము, దరము అందురే, వాటిస్వభావము లేవి? 

ఉ. డం బమనగా లోకమెల్ల తనను మెచ్చుకొనవలెనని, దానము, ధర్మము, యాగము, యజ్ఞము మొదలగునని చేయుట. దర్పమనగా పుత్ర, మిత్ర, కళత్ర, బంధు, బలగ, ధన, ధాన్య సంపదలయందు, తనతో సరియగు వారు లేరని భావించుట. 

 

ప్ర.  ఈద్య అంటే యేమిటి? 

ఉ  ఈర్య అనగా తనకు గలిగిన దుఃఖములు, కష్టములు, అశాంతులు ఇతరులకు కూడనూ సదా కలుగవలెనని కోరుచుండుట. అసూయ అనగా నిరంతరము ఒకరికి చెడుపు చేయవలెనని తలంచుచుండుటయే కాక తలంపులకై తానెట్టి కష్టనష్టముల నైననూ అనుభవించుటకు సిద్ధముగా నుండుట. ఇట్టి వానినే అంతర్ శత్రువని కూడను అందురు. ఈ పరస్పరా ధ్యానము ఉన్నంతవరకూ మానవుడు ముముక్షువు కాజాలడు. (ప్ర .శ్నో. వా. పు22/23) -


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage