తారమరపువ్వు బురదలో పుట్టుతుంది. వాసనగల ఆ నీటిలో నుంచే పైకి వస్తుంది. తామరాకు మీద నీరు వేసినా అంటదు. అట్లే బురద చెడునీరు అనే అరిషడ్వర్గాలను తీసివెయ్యి. స్వచ్ఛమైన, ఆనంద మైన తారమరాకు మిగులుతుంది. అది "నేనే". తామరాకు మీద నీటి బొట్టువలె సంసారములో యుండి సంసార వాసనలు అంటుకోబోకు. మిగిలేది "నేనే సర్వ శేషిని ప్రేమస్వరూపుడను. అనుభవించి ఇతరుల కందించు.
(సా. పు. 462)