ఆ ఆధునిక యుగంలో "అర్ధనారీశ్వర తత్త్వాన్ని ఎవ్వరూ చక్కగా గుర్తించుకొన లేకపోతున్నారు. ఏ సైంటిస్టు కూడా చక్కగా వివరించి చెప్పడం లేదు. ప్రతి పదార్థము అణుపులతో కూడినటువంటిది. ప్రతి అణువు నందు ఎలక్ట్రాన్, ప్రోటాన్ అనే రెండు శక్తులుంటున్నాయి. సంస్కృతంలో ఎలక్ట్రాన్ అనేది ఋణభాగమును, ప్రోటాన్ అనేది ధనబాగమును సూచిస్తాయి. ఎలక్ట్రాన్ స్త్రీ తత్త్వాన్ని, ప్రోటాన్ పురుషతత్వాన్ని గుర్తింపజేస్తాయి. ఈ రెండింటి చేరిక ద్వారానే అణువు లేర్పడుతున్నాయి. ప్రపంచము నందలి ప్రతి పదార్థమూ అణువుల యొక్క స్వరూపమే. కాబట్టి, ఈ జగత్తు "అర్ధనారీశ్వరస్వరూపం" అని మన పూర్వీకులు నిర్ణయించారు. ఈ విధముగా మన పూర్వీకులు నిర్ణయించారు. ఈ విధముగా మన పూర్వీకులు తెలిపిన అర్ధనారీశ్వరతత్వాన్ని’ నేటి సైన్సు ద్వారా పరిశీలిస్తే, ఈ రెండింటికి ఎంతో సన్నిహిత సంబంధము ఉన్నదని గుర్తించవచ్చును.
(స. సా.. అ. 91. పు.261)