ఈ ప్రకృతిలో ఆకారమును ధరించిన వారందరూ స్త్రీలే. భగవంతుడొక్కడే పురుషుడు. ప్యాంటు, షర్టు వేసుకున్నంత మాత్రమున పురుషుడని, చీర కట్టుకున్నంత మాత్రమున స్త్రీ అని చెప్పడానికి వీల్లేదు. దేహమునకు పురము అని పేరు. ఈ పురములో నఖశిఖ పర్యంతము సంచరించే చైతన్యమునకే పురుషుడని పేరు. కనుక లోపలున్నది చైతన్యము, బయట ఉన్నది జడము. ఈ జడ చైతన్యముల ఏకత్వమే అర్ధనారీశ్వర స్వరూపము. కనుక ప్రతి మానవుడూ అర్ధనారీశ్వరుడే. దేహము ప్రకృతి (స్త్రీ): చైతన్యము - పురుషుడు (ఈశ్వరుడు) ఈ రెండింటి ఏకత్వం చేతనే మానవత్వం ఏర్పడుచున్నది.
(స.సా.జులై.98, పు.187)