స్వాహుతి అనగా వస్తువులను అగ్నిలో చక్కగా దగ్ధము చేయుట లేక జీర్ణము చేయుట అని మాత్రమే కాదు. లౌకికముగా వస్తువులు ఆగ్నిలో దగ్ధమై పోవుట మాత్రమే చూతురుకాని ఆగ్నికి దేవతా స్వరూపము. భౌతిక స్వరూపము రెండుమా కలవని తెలిసికొనరు. దేవతా శరీరము అతీంద్రియ మగుటచే కర్మానుష్ఠాన సమయమున ఆయా దివ్యరూపముల ఆరాధించుట శ్రుతి సమ్మతము.
(లి.వా.పు 21, 22)
(చూ పురుషార్ధము)