ఈ దేశపు ప్రజల దృష్టి అంధకారముచే నావృతమై యున్నందున వారు దారితప్పి. ఏవేవో లక్ష్యములు పెట్టుకొని, వాటి నన్వేషించుటలో - ముఖ్య లక్ష్యమును చేరలేకపోయినారు. అట్టి వారికి శంకరులు అద్వైతము బోధించి, వేదములు, ఉపనిషత్తులు, శాస్త్రములు ఏకగ్రీవముగా నంగీకరించిన మార్గ మది యొక్కటియేయని తెలియజెప్పినారు. జీవుడు. ఈశ్వరుడు - ఒకడే గాని ఇద్దరు కాదని చెప్పు మతము అద్వైతము.
(సవ పు || 12)
(చూ: దాసోహం, భక్తిప్రపత్తులు, శంకరాచార్యులు)