నీలో నున్న దివ్యకాంతి నీచుట్టూ ప్రసరించి, అంతటా వెలుగు నింపి, అన్ని దేశాలలోను, అన్ని కాలాలలోను లక్షలాది దివ్వెలను వెలిగిస్తోందని తెలుసుకో. భగవంతుడు అవతార స్వరూపుడై దిగివచ్చి ప్రపంచానికి బోధ చేసే ఈ తరుణంలో ఆయనను ప్రత్యక్షంగా దర్శించుకుని ఆయనే ప్రత్యక్షంగా దారి చూపించే అదృష్టమును పొందిన ఈ తరంలోని భక్తులు నిజంగా అదృష్టవంతులు.
(దై. పు. 360)
(చూ|| హిరణ్యగర్భవత్యం)