నీకు నా పుట్టుపూర్వోత్తరాలను గురించి అర్హతా యోగ్యతలను గురించి తెలయపరచిన తర్వాత మాత్రమే నిన్ను సరిదిద్దడానికి నిశ్చయించుకొన్నాను. అందుకనే నేను అప్పుడప్పుడు నా ప్రకృతిని మానవశక్తిచే తెలియబడనేరని, మానవ గ్రాహ్యతలకు
అందని అద్భుతా లనబడే క్రియలద్వారా ప్రకటిస్తూ ఉంటాను. ఇది నా శక్తులను ప్రదర్శించడానికి ఆతుర పడుచున్నానని కాదుగాక నా ధ్యేయము మిమ్మల్ని నాకు మరింత సన్నిహిత పర్చుకోవడానికి, మీ హృదయాల్ని నాకు మరింత గట్టిగా అనుబంధించుకోవడానికి మాత్రమే.
(సా.ఆ.పు. 255/256)