అధిక సంఖ్యాకులు అభయమును సూచించే రక్షలను కోరుతున్నారు. కాబట్టి నేను ఇస్తున్నాను. ఆపదలో వున్నప్పుడు నే నిచ్చిన వుంగరమునూ,కంకణమునూ,గడియారమును స్పృశించి నన్ను తలుచుకొని నా సహాయమును అర్థిస్తూ వుంటారు.
ధరించటానికి వీలు లేని వస్తువును ఇచ్చినట్లయితే వాటిని ఎక్కడో దాచుకొని పోగొట్టుకుంటారు.
నేను ఇచ్చే ఈ చిన్న చిన్న వస్తువులు ప్రజలకుభద్రత,రక్షణ,కలిగిస్తూ,ఆపదసమయాలలో ధైర్యము చెదరనీయవు. ఎంతో దూరాన వున్న వారికి నాకు మధ్య వీటి వల్ల అనుసంధానము ఏర్పడుతుంది. భక్తులు ఆపదలో వున్నప్పుడు నా సహాయం కోరినప్పుడు ఈ వస్తువుల ద్వారా అదృశంగా సందేశం నాకు విద్యుత్ వేగంతో అందుతుంది. వెంటనే నేను వారిని అందుకుంటాము.
కంపెనీలు తయారు చేసిన గడియారాలను నేను తెచ్చి యివ్వటం లేదు. నేను వాటి సృష్టి చేస్తున్నాను. నేను ఏది సంకల్పించినా క్షణంలో అది తయారు అవుతుంది.
(స.ప్ర.పు. 16/17)