స్వల్ప అక్షరపదాలతో సారభూతమైన అనంత అర్థాన్ని చాలా తక్కువగా సూచించేవి సూత్రాలు. సర్వోపనిషద్వాక్య సుమములను కూర్చిన, చేర్చిన, వేదాంత శాస్త్రము ఈ బ్రహ్మసూత్రము. ఒక్కొక్క సూత్రము ఒక్కొక్క విధముగా వ్యాఖ్యానింపబడినది. ఒక్కొక్కరు తమ తమ విశ్వాసములను అభిరుచులను అనుభవాలను ఆనందాన్ని పురస్కరించుకొని ఈ సూత్రాలకు వాఖ్యానాలు వ్రాశారు. ఇందులో మొదటి సూత్రము:
అధ శబ్దమునకుఎన్నియోఅర్థములుకలవు.ఇచ్చట తరువాత లేక అనంతరము"అనుఅర్థమునేమనము తీసుకోవలసి వచ్చును. ఆయితే దేని తరువాత అని మరొక ప్రశ్న వేసుకొన్న బ్రహ్మమ గురించి జిజిజ్ఞాస కలిగిన తరువాత అని తెలియును.
అట్టి జిజ్ఞాసకు ఎట్టివాడు అధికారి? అని తిరిగి మనము ప్రశ్నించుకొన్న ఆ అధికారములు ఏవి అను విచారణ వచ్చును. వీటినే అథ శబ్దము సూచించుచున్నది. ఇట్టి జిజ్ఞాస కేవలము వేదాధ్యయనము కాజాలదు. ఇది కేవలము ధర్మజ్ఞానమునకు, బ్రహ్మజ్ఞానమునకు అవసరమైనది. అయితే వేదాంత అధ్యయనము వలననే బ్రహ్మజిజ్ఞాస కలుగును.