మానవత్వం సర్వోత్కృష్టమైనది. మానవునికి పార్థుడనీ కూడా పేరు కలదు. పార్థుడనగా పృథ్వీ పుత్రుడని అర్థం. భూమి యందు ఎన్ని శక్తులు కలవో ఆ శక్తులన్నీ ఈ భూమి నుండి ఆవిర్భవించిన మానవునియందు కూడా కలవు. అవి అనంతమైనవి. అప్ర మేయమైనవి, అగోచరమైనవి.కాని, అవి అతనికి గోచరించకుండా అణిగి మణిగి అజ్ఞాతంగా ఉంటున్నాయి. వాటిని అతీత శక్తులు" అని కూడా అన్నారు. మానవునిలో అయస్కాంత శక్తి, విద్యుచ్ఛక్తి, రసాయనిక శక్తి, కాంతి శక్తి మున్నగు అనంతమైన శక్తులు ఉండటంచేతనే మానవుడు నిత్యజీవితంలో అనేక కర్మలను ఆచరించగలుతున్నాడు. తనయందు ఈ శక్తులే లేకున్న తాను నడువ లేడు, నవ్వలేడు, తినలేడు, త్రాగలేడు, ఏ పనీ చేయలేడు అయితే, ఇన్ని శక్తులు తనయందున్నప్పటికీ మానవుడు పశువుగానే ప్రవర్తిస్తున్నాడు. కారణ మేమిటి? బుద్ధి దోషముచేతనే మానవునిలో దివ్యత్వం అణిగిపోయి పశుత్వం ప్రబలిపోయింది. బుద్ధిదోషముచేతమానవుడుసత్యమేమిటో,ధర్మమేమిఅటోతెలిసినప్పటికీవాటినిపాటించలేకపోతున్నాడు.పాటించలేకపోవడమేకాకుండా అనర్థాలను పెంచుకుని యథార్థాన్ని మరచిపోతున్నాడు.
(స.సా. సం.99 పు. 285)