అణుస్వరూపమే మానవాకారాన్ని ధరించి జగత్తులో సాక్షాత్కరిస్తున్నది. రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, ఏసు, జోరాష్ట్ర ఇలాంటి రూపములన్నీ ఏవిధంగా వచ్చాయి? ఇక్కడ ఒక విషయమును చక్కగా విచారించాలి.గాలిది ఏ రూపము? నీటిది ఏ రూపము? ఏ రూపమూ లేదు. గాలిని బెలూన్లో నింపితే ఆది బెలూన్ రూపాన్ని ధరిస్తుంది. వీటిని ఏ పాత్రలో పాస్తే అది ఆపాత్ర రూపాన్ని ధరిస్తుంది. అదేవిధంగా, పవిత్రమైన పరిపూర్ణమైన దివ్యత్వము ఏఆకారంలో చేరితే ఆ స్వరూపాన్ని ధరిస్తుంది. బుద్ధుడు, రాముడు మున్నగువారు కేవలం ఆకారంలోవేర్వేరుగాని, వారిలోఉన్నదంతా దైవత్వమే. ఇదేవిధంగా, ప్రతిమానవునియందుఅణుతత్త్యమనేదివ్యత్వంవ్యాపించియుంది.ఇట్టిఅణుస్వరూపమైన దివ్యత్వమును గుర్తించడానికి మీరు ఏ సాధనలూ చేయనక్కర లేదు. దైవము సర్వస్వరూపుడనే సత్యాన్ని గుర్తించుకుంటే చాలు. భారతము, భాగవతము, రామాయణము, గీత అన్నింటి ఏకత్వము దివ్యమైన ఆత్మతత్యమే. ఇదియే దైవత్వము. మీరు పెద్ద పెద్ద తలదిండులవలెనున్న ఎన్నో గ్రంధాలను చదువుతున్నారు. కానీ, ఇలాంటి గ్రంథము ప్రపంచంలో మరొకటి లేనే లేదు (శ్రీవారు ఆగ్గి పెట్టె సైజులో ఉన్న ఒక బంగారు పుస్తకాన్ని సృష్టించారు) ఇదియే ఆ గ్రంథము, చూడండి. ఇందులోనే రామాయణము, భారతము, భాగవతము, గీత సర్వము ఏకమై ఉంటున్నాయి. అణుమాత్రమైన ఈ గ్రంథమునందే అఖండ స్వరూపమైన దైవత్వం ఇమిడి ఉన్నది. ఇవన్నీ శ్లోకములే. ఒక్కొక్క పేజీలో 700 శ్లోకాలుంటున్నాయి. ఇది ఎక్కడ ఉండినది? సామాన్య మానవుల దగ్గర ఉండినది కాదు, వ్యాస మహర్షి చెంత ఉండినది. అతను దీనిని తన కుమారుడైన శుకునకు అందించాడు. ఇందులోనే స్వామియొక్క అవతారాన్ని గురించి తెలిపే శుకవాడి ఉంటున్నది. .
(సా.శ్రు.పు.42/43)