భగవంతుడు ఏస్థానమందున్నాడన్నది వేదం చక్కగా నిరూపించింది. దైవం హృదయవాసి అని నిష్కర్షగా చెప్పింది. అయితే అందరికీ కనిపించడు. దేవాలయంలో దీనికి చిహ్నంగా ఒక గంటను పెట్టారు. హృదయములో అనాహత స్థానములో ఉండేవాడు అని దీని అంతరార్థం. మూలాధారం నుండి బయల్దేరే అనాహతమునకు ఈ హృదయం స్థానంగా నిర్వచించారు. భగవంతుని నివాసము అనాహతము.
అనాహతి అనగా ఏమి? ఒకరి చేత కొట్టబడేది కాదు. తనంతట తానే కొట్టుకుంటూ ఉంటుంది. అని దీని అర్థము. దేహమనే దేవాలయములో ఉన్న గంటను ఎవ్వరూ కొట్టనక్కర్లేదు..ఎప్పుడూ అదే కొట్టుకుంటూ ఉంటుంది. భగవంతుడు శబ్దస్వరూపుడు ఎవ్వరూ ఉచ్చరించకుండానే తనకు తానే ఉచ్చరించుకుంటూ ఉంటాడు.
(త.శ.మ.పు.60)