దృశ్య కల్పితమైన చరాచర ప్రపంచమంతయు కాలావాహిని లో కలిసి పోతుంది. "యద్ధృశ్యం తన్నశ్యతి". ఏది మనకు కనిపించుచున్నదో అది కొంతకాలములోనే మనకు మరుగై పోతుండాది. ఈ చర్మచక్షువులకు గోచరమయ్యే ఈ దృశ్య కల్పిత జగత్తంతయు కాలగర్భములో కలిసి పోతుండాది. చూచే నేత్రము, చూడబడే విశ్వము, రెండు అనిత్యములు.
(బృత్ర.పు, ౧౫౮ )