ఒక చిన్న పక్షి లేత కొమ్మపై వ్రాలినప్పుడు గాలికి ఆ కొమ్మ అటూ ఇటూ ఊగినా అది ఏమాత్రము భయపడదు. కారణమేమిటి? అది తన రెక్కలను ఆశ్రయించిందికాని కొమ్మపై ఆధారపడలేదు. కాని ఈనాడు మానవుడు సంసారమనే వృక్షముపై కూర్చొని, ఏ కించిత్ బాధలు కలిగినా భయపడి పారిపోతున్నాడు. కారణమేమిటి? ఆత్మవిశ్వాసమును కోల్పోవడమే! భుజబలముపైన, బుద్ధిబలముపైన, ధనబలముపైన, జనబలముపైన మనిషి ఆధారపడి ఉంటున్నాడుగాని ఆత్మబలమును ఆశ్రయించడం లేదు. ఆత్మవిశ్వాసము ఒక్కటి ఉంటే సర్వమును సాధించవచ్చు. (శ్రీ సత్యసాయి సనాతన సారథి, మార్చి 2023 పు29)