పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి
పట్టు నెగ్గె డిదాక అట్లె ఉండు
కోరిన దేదియో కోరనే కోరితివి
కోర్కె చెల్లెడు దాక పోవకుండు
అడిగిన దేదియో అడుగనే అడిగితివి
అడిగిన దిడుదాక విడువకుండు
తలచిన దేదియో తలచనే తలిచితివి
తలపు తీరెడు దాక పోవకుండు
పోరు పడలేక తానైన బ్రోవవలయు
ఒడలు తెలియక నీవైన మడుగవలయు
పదములు వీడక పట్టుడు
వదలకుడే నాటికైన వరదుడే కనడే
ముదమీయడే ఎదమీటడే?
మదమాత్సర్యముల ద్రుంచి మనమున గొనడే!
(బా.జీ.ఐ.స. పు.85/86)