శత్రువు నీయందలి పట్టుదలను సైర్యమును, ఓరిమిని, నిగ్రహమును, ఇంకా ఎన్నిటినో పరీక్షించుచూ ఉంటాడు.నీ వెప్పుడూ సావధానముగా హెచ్చరికతో ఉండునట్లు చేస్తాడు. రాముని విజయమునకు రావణుడు ప్రధానకారణము. శ్రీకృష్ణుని లీలలను కంసుడు ప్రపంచములో చాటించినాడు. ప్రహ్లాదుని అనన్యభక్తిని తండ్రి హిరణ్యకశిపుడు ప్రకటింపచేసినాడు. కురుక్షేత్ర యుద్ధము కారణముగా ధర్మక్షేత్రమయినది; చరిత్రలో సువర్ణాక్షరములతో లిఖింపబడినది.
(స్వీ.పు.348)
(చూ॥ దివ్య ప్రకటనలు)