సాయిబాబకే పూజచేసి...
ప॥ సాయిబాబాకే పూజచేసి మీరలు శాశ్వతముగ
సుఖము జెందుడీ - ఓ భక్తులార!!
చ॥ మాయాంధకారంబు మాయించి,
జ్ఞానంబు సాయీశుడొసగు మనలకు
వేగమే సత్యంబు జూపు మనలకు ॥ సా||
చ॥ కాయంబనిత్యంబు; ధ్యానించి సాయీశు
రేయింబవళ్ళు కొలువరే - సాయినే
రేయింబవళ్ళు కొలువరే ॥ సా||
చ॥ సాయీశుడే యిట్లు సత్యనారాయణుడై
మా యింట వెలసెనిప్పుడు
మా కొరకై యీ లీల అవతరించెగా ॥సా||
(పాతమందిరం నాటి భజనావళి నుండి)
(సనాతన సారథి, అక్టోబరు 2022 పు 25)