పుణ్యతీర్థంలో స్నానం చేసినప్పుడైనా మూడు మునకలు వెయ్యాలి అంటారు. దాని అర్థం యిది. మొదటి మునక స్థూల శరీరాన్ని శుభ్రపరుస్తుంది. రెండవ మునక ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశములకు చెందిన సూక్ష్మ శరీరమునూ, మూడవ మునక విజ్ఞానమయ కోశమునకు సంబంధించిన కారణ శరీరమునూ పరిశుభ్రము చేయగా యింకా కొంతమయ మిగిలి ఉంటుంది. ఆ మూడు మునక లూ కర్మసాధన ఉపాసనలను పవిత్రంచేసి జ్ఞానము ప్రసాదించును. ఆధ్యాత్మిక చైతన్యమందు ద్వైత విశిష్టాద్వైత అద్వైతములు మూడు సోపానములు . ప్రతి రంగమందును ద్వైత అద్వైత వైఖరులు ప్రజల భావములను ఏ విధముగా ప్రభావితము చేయుచున్నవో సోమ శేఖరశాస్త్రి వివరించాడు. అవి భిన్నములు కావు. మానసిక పరివర్తనమందు వేరు వేరు దశలు. (శ్రీ సత్య సాయి వచనా మృ తము 1963 పు 140)