దేశమంటే వట్టి మట్టిగడ్డ కాదు. దేశమంటే మానవులే. దేశమును తీర్చిదిద్దటమంటే మానవులను తీర్చిదిద్దటమే. మానవులను తీర్చిదిద్దటమంటే ఏమిటి? నైతికంగా, ధార్మికంగా వారిని సంస్కరించటమేనంటూ “సంస్కరణ అనగా మన నిత్య జీవితంలో నున్న దోషములను నిర్మూలన గావించి; పవిత్రతను, సద్భావములను అభివృద్ధి గావించుకోవడమే" జీవితం సంస్కారముల పైననే ఆధారపడి వుంటుంది. ధాన్యం పొట్టును తొలగించకుండా అన్నం వండలేము కదా! అదే విధముగా ప్రత్తిని వడికి దారం చేసిన తరువాతనే గదా వస్త్రం తయారయ్యేది. భూమిలో దొరికిన ముడి బంగారు ఖనిజమును సంస్కరించినప్పుడే గదా అది అపరంజిగా రూపొందేది. వీనినే సంస్కరణలంటారు. (ప్రేమ జ్యో తి పు 80)