ఇంద్రియములు విషయములతో చేరినప్పుడు అనంతమైన ఆనందాన్ని, అనంతమైన దుఃఖాన్ని అందిస్తుంది. నీ ఇంద్రియములు ఇక్కడనే ఉంటున్నాయి, నిన్నెవరో బయట దూషిస్తున్నారు. ఈ దూషణ అనే విషయము బయట ఉంటుంది. ఆ దూషణ అనే విషయము ఇంద్రియములతో చేరనంతవరకు నీవు ఏ విధమైన వికారము పొందవు. - ఆవేశానికి అవకాశమందించవు. ఉద్రేకపడవు. కానీ, ఆ విషయమే నీ చెవులకు సోకినప్పుడు నీవు ఎంతైనా క్రోధము చేత, ఆవేశము చేత, ఉద్రేకము చేత నిండిపోతావు. ఈ ఆవేశమునకు, ఉద్రేకమునకు కారణమేమిటి? విషయములు ఇంద్రియములతో చేరనంత వరకు ఎట్టి ఆవేశమూ లేదు. విషయములు ఇంద్రియములతో చేరినప్పుడే ఈ ఆవేశము బయలుదేరుతుంది. (ది. 23-05-1990న బృందావనంలో శ్రీవారి దివ్యబోధ నుండి) (శ్రీ వాణి మార్చి - 2021 పు29/30)