కాషాయవస్త్రంబు కట్టిన మాత్రాన
కరతలాములకంబు కాదు భక్తి
నోటితో మంత్రంబునుచ్చరించిన యంత
పరతత్త్య మహిమ పట్టుబడదు.
గీతను చేబట్టి కేకలు వేసిన
పుణ్యమన యింట ప్రోగుపడదు
చెప్పు మాటలకు చేసిన పనులకు
బంధమున్న వాడు సాధువగును.
(ము.ము.పు.46)
సాధు జనులను జూచి చౌకను చేతురు
వారికేమి కొరత వసుధ యందు
కుంజరమును జూచి కుక్కలెన్నో మొరుగు
దాని ఘనత కేమి తక్కువగును
(దసరా సందేశాలు పు 32)