వెన్నెలవంటి చూపు, వెన్నెలవంటి హృదయము, తేనె వంటిమాట, సాయి భక్తులకు సహజమై వెలగాలి.స్వార్థరహితమైన సమత్వ ప్రేమ సాయి స్వరూపము. అన్యోన్యమైన సమంజస ప్రేమసాయి దృష్టి, ఈ రెంటిని పాటించిన వారే సాయి భక్తులు. పరమాత్ముడు ప్రేమకు వశుడు గాని పదార్థమునకు వశుడుకాడు. భక్తికి తగిన ప్రవర్తనలను మానవుడు ప్రధాన నేత్రములుగా ధరించవలెను, నేత్రములు ప్రేమమయములైనప్పుడే లోకమంతా బ్రహ్మ మయమగును. వ్రతములు, ఊరేగింపులు, అర్చన, అభిషేకము లంటే, సత్కర్మలతో, సదాచారములతో, సద్వాక్యములతో సాయిని సేవింపుడు. ఆదే సాయికి ప్రీతియైన పదార్థము. ఆదే యధార్థము. ఇదే ఆనంద బిందువుల ఆరగింపు. ఇదే సాయి ఆపేక్ష. భక్త బృందము నకు శ్రీరామ రక్ష.
(జ.పు.88)