విద్యార్థులారా! Vice-chancellors come and go, but Swamiji s love comes and grows ఎంతమంది వైస్- ఛాన్సలర్సు మారినప్పటికీ వారి ప్రేమకు, స్వామి ప్రేమకు, వారిహృదయానికి స్వామిహృదయానికి సన్నిహిత సంబంధ బాంధవ్యమనేది పెరుగునేగాని మారదు. వైస్- ఛాన్సలర్సు, ఛైర్స్, పేర్లు మారవచ్చునేగాని, వారి హృదయములు ఎప్పుడు కూడా మారటానికి వీలుండదు. మన సరాఫ్ ఈ విధమైన ఉద్దేశ్యముతో ఉండటంచేతనే అతనిని బయటకు పంపటం లేదు. అతని శేషజీవితమంతయు స్వామి సేవయందు, సమాజ సేవయందు, అంకితముగావించుకొని ఆనందము పొందాలనే ఉద్దేశ్యముతో ఉండటంచేత అతనిని మా సెంట్రల్ ట్రస్ట్ లో పెట్టుకొని తద్వారా యూనివర్సిటీకి తగిన సంబంధ బాంధవ్యములు అందించే నిమిత్తమై నిర్ణయించుకున్నాము. కనుక సరాఫ్ బయట ప్రదేశానికి వెళ్ళుతాడో ఏమోనని మీరు ఏమాత్రం విచారపడ నక్కర లేదు. అతను మనమధ్యలోనే ఉంటాడు. మనతో నిత్యసంబంధబాంధవ్యముగా ఉండి తిరిగి అతను కూడా ఛైర్ మారినప్పటికి, పేరు మారినప్పటికి మన వైస్- ఛాన్సలర్ గానే మనకు అనేక విధములుగా తోడ్పాటుగా ఉంటాడు. వీరిరువురు కేవలము స్వామి అండదండలు ఆశించి వచ్చినటువంటివారు కాబట్టి ఇరువురు (అనేక విధములైన శక్తి సామర్థ్యములు కలిగి, లౌకికంగా, భౌతికంగా,ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా కూడను ఉత్తీర్ణుడైన సంపత్ ఈనాటినుండి వైస్- చాంస్ లర్ పదవిని స్వీకరి స్థున్నాడు.) రామలక్ష్మణులవలె కలసి మెలసి ఈ కార్యక్రమములో పాల్గొని అభివృద్ధికి తెస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. తేది 14- 1 – 1991 విశ్వవిద్యాలయ ప్రాంగణము ( క్రీడోత్సవ సందర్భముగా స్వామి విద్యార్థుల నుద్దేశించి చేసిన ప్రసంగము) ((శ్రీ సత్య సాయి వచనా మృ తము 1991 పు25-26)