"సర్వచింతలు బాపెడి సాయి ప్రేమ
గొనుడు ఇకనైన ప్రజలార ప్రేమతోడు".
సర్వచింతలూ దీనివల్లనే పరిహారమౌతాయి. కనుక, మీరు సాయిప్రేమను పొందటానికి కృషి చేయండి. దైవ ప్రేమచేత మీరు దేనినైనా సాధించవచ్చు. కేవలం భారతీయులు మాత్రమే కాదు. విదేశీయులలో కూడా దైవ ప్రేమ చేత ఎన్నియో ఘనకార్యములు సాధించిన వారున్నారు. (దివ్యసందేశము. 23.11.200 1పు.7)