నా కాలిగోరు మొదలుకొని తల వెంట్రుకవరకు అంతాప్రేమయే. ఈ ప్రేమచేతనే స్వామితత్వం జగత్తంతా వ్యాప్తి అవుతున్నది. ఆ ఒక్కటే నేను ఆశించటం లేదు నాయందు మూడు P లు ఉంటూన్నయి ఏమిటవి? మొదటి P. Purity పవిత్రత రెండవ P Patience (సహనం); మూడవ P-Perseverence పట్టుదల. సాయినామం జగద్వ్యా ప్తి కావడానికి కారణం ఈ మూడే.
(స.సా.డి.96పు.315)
ఒక్క తెలుగు భాషలో నేకాక, తమిళ భక్తులకొరకు తమిమిళంలో కూడా, తనమీద తానే ఒక చక్కని గీతమును రచించి గానం చేశారు. బాబా. దీనికి తమిళంలో తీయబడిన "మిరా” చిత్రంలో పాడిన ఒక భక్తి గీతపు మెట్టే అమర్చి, భక్తులు సులభo గా పాడటానికి ఆ వరసలో నే పాడారు. యిందులో తమ సర్వవ్యాపకత్వము, తమ దివ్యనామ మహిమ చక్కగా వర్ణించారు.
“సాయీ నీ దివ్యనామము
స్మరించిన చాలు, ఎదలు కరిగిపోవును
జనన మరణముల హరియించు నామము
భూమ్యాకాశముల-నిండిన నామము
ఆచం ద్రార్కము నుతియించు-నామము
హా నేనేమని పొగడెద నీ మహిమలు
వ్యధలన్ని తరుగు నే-మది కరిగించు నే”
జయ జయ సాయి జయ జయ బాబా
జయ జయ సత్యస్వరూపా
జయ జయ సత్యస్వరూపా- జయ జయ బాబా
జయ జయ సాయి
కాలమంతను-నీ పావన నామమును
తలచి -తలచి -తరించితి నే
సాయి-నీ దివ్యనామము నీ నామము
దివ్యనామము||
(స్వా. పు 309-310)