సనాతన సారథి

"సనాతన సారథి" నా సంకల్పము, నా ఉత్సాహము, నా ఆనందముల ఫలితమే. నేను ఏదైన నిర్ణయం తీసికొంటే నా మార్గానికి అడ్డు ఉండదు. పరమాత్మ తత్త్యం మానవ శరీరం ధరించి వచ్చినప్పుడు మహాశక్తితో, మహాస్వరూపంతో కాక మాయాశక్తితో మాయా స్వరూపంతో ఉంటుంది. అందువల్ల చంచలత్వం కలిగిన మీకు దానిని కనుగొనటం కష్టమవుతుంది. ఒక్కసారి మీరు ఆ తత్త్వాన్ని గ్రహించారా అన్ని సందేహాలు పటాపంచలవుతాయి.

((శ్రీవ. 61-62 పు. 14)

 

వేదములు, శాస్త్రములు, విశ్వాసాన్ని పెంపొందించే ఇతర మతగ్రంధాలు అన్యాయం, అసత్యం, అవనితి కౄరత్వం, హింస మొదలగు శక్తుల పై పోరాడుతున్న విధంగా ఈ నాటి నుండీ మన "సనాతన సారథి" కూడా సత్యమేవ జయతే అన్న విధంగా సత్యముజయించేలా విజయపథంలో నడిపిస్తుంది. ఈ పత్రిక స్థాపించటానికి ముఖ్యకారణం ఇదే. లోక కల్యాణం కోసమై ఈ పత్రిక పోరాడుతుంది.విశ్వవ్యాప్తంగా ఆనందం సంస్థాపించబడినప్పుడు ఈ పత్రిక విజయనీతికలను ఆలపించి తీరుతుంది.".

(స. శి.సు.నా.పు.119)

 

నేటి నుండి "మన సనాతన సారథి" పురాతన వేదశాస్త్ర ఉపనిషత్తులను సైన్యముతో అన్యాయ, అక్రమ, అసత్య అనాచారములనబడు అహంకారమును హతమార్చ బయలుదేరినది.

 

ఈ సారధి లోక క్షేమమునకు పోరాడి జయభేరి మ్రోగించి, జనుల ఆనందమునకు ఆధారమగుగాక! (మహాశివరాత్రి 1958)

(స. సా.60వ జన్మదినోత్సవ సమర్పణ మొదటి పుట)

 

గొప్పవారు తమ స్థిరత్వమును యెన్నడూ కోల్పోరు.ప్రశాంతిస్థితిని కాపాడుకొనుట ద్వారా మనము ఆటంకములను అనుకూలముగా మార్చుకొనవచ్చును. ఎప్పుడు ఎట్టి సమయమందైననూ నిరుత్సాహమునకు చోటివ్వరాదు.

 

ఎప్పుడు మానవుడు సమస్తమును ఆత్మయేనని అనుభూతికి తెచ్చుకొనునో అప్పుడిక తా నెట్టి పదార్థమును ఆశించడు. అంతయూ తానేయని నిరంతరానందమును అనుభవించును. అట్టి స్థితిని పొందుటే మానవుని ప్రధాన కర్తవ్యము.

అట్టిదాని నందించుటే "సనాతన సారథి" విధి. ఇదే భక్తుల పాలిట పెన్నిధి.

(60వ జన్మదిన సంచిక రెండవ పుట)

 

రాక్షసత్వంలో నడపబడే అన్యాయం, అక్రమం, అసత్యం, కౄరత్వం అనే పాశవిక బలాలపై ఆధ్యాత్మిక ప్రసంగాలు, ఆధ్యాత్మిక చింతన అనే సైన్యం సహాయంతో ఈ సనాతన సారథి తిరుగుబాటు చేస్తుంది. ప్రపంచంలో సుస్థిరశాంతి స్థాపనకై ఈ సారథి పోరాటం కొనసాగు తుంది. తన విజయ ఢంకా మ్రోగిస్తూ మానవలోకానికి ఆనందం ప్రసాదిస్తుంది.

(శ్రీ.స.ప్రే. స్ర.పు.220/221)

 

శ్రీ సత్యసాయిబాబా Sri Satya Sai Baba SSSB అంటే మొదటి S-Sangha (సంఘము - Society). మొదటి S సంఘాన్ని ఉద్దేశించి ఉన్నది. సంఘాన్ని ప్రకాశవంతం చేయటానికి, వ్యక్తిగత ఉన్నతికి సాధనంగా సంఘ సమైక్యతను ఉపయోగించటం ద్వారా సంఘంలో ఒకడిగా, సంఘంద్వారా పరమోన్నతి పొందటానికి ఉపకరిస్తుంది. రెండవ S సంస్కృతిని సూచిస్తుంది. మానవ సహజ - స్వభావమైన మానవత, ఉత్సాహము, రసస్ఫూర్తి మొదలగుభావాలను ఉన్నత స్థాయికి కొనిపోవటానికి కృషి చేసి వ్యక్తిగత పవిత్రత, మాధుర్యమును పెంపొందింప చేయటం ద్వారా సంఘంలో ఐకమత్యమును. అన్యోన్యతను, మధురిమను కలుగచేయటాన్ని సూచిస్తుంది.

 

మూడవ S సనాతనత్వాన్ని తెలియచేస్తుంది. అనాదిగా వస్తున్న మానవత్వపు విలువలను పెంపొందించటాన్ని సూచిస్తుంది.

 

అన్ని ప్రాంతాలకు అన్ని యుగాలకు చెందిన అనేకమంది తత్త్వవేత్తలు, సాధువులు, ఋషులు మొదలైన వారిచే కనుగొనబడిన, వర్ణించబడిన మానవత్వపు విలువలను పరిపూర్ణం చెయ్యటానికి, సంరక్షించటానికి సంకల్పించాను. ఇక ఆఖరి పదమైన బాబా లో మొదటి అక్షరం బి అనేది Blockను తెలియచేస్తుంది. మొదటి మూడు యస్ లు మానవజీవితోద్ధారణకై స్వామి అవలంబిస్తున్న పథకాన్ని తెలియచేస్తుంటే ఈ బి" అనే అక్షరం దానికి సంబంధించని ఏ యితర విషయమైనా Blocked అక్కరలేనిది అని తెలియ చేస్తోంది. అవి తప్ప మరే యితర విషయాలైనా ఆనవసరము, అప్రస్తుతము.

 

కాబట్టి సనాతన సారథి మూడు అంశాలపైనా ఆధారపడి ప్రచురించబడుతున్నది. ఇందుకు సంబంధించని ఏవిధమైనా ప్రచురణకు అనర్హమే అవసరమే.

(శ్రీస.ప్రే. .పు.222)

 

దైవభక్తి, మత, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన రచనలు మాత్రమే పాఠకులు ప్రచురణకు పంపించాలి. చెప్పే విషయం కాని, వ్రాసే విషయం కాని, ఆచరణలో స్వయంగా పెట్టగలిగినవారే అటువంటి విషయాలను ప్రచురణకు పంపించాలి. రాజకీయమైన, బహి రంగమైనవిషయాలకు సంబంధించిన వార్తలు కాని, అట్టి వార్తలపై వ్యాఖ్యలు కాని ప్రచురణకు పంపించరాదు. మొరటు పదజాలం కాని, వ్యక్తిగత దూషణలు కాని రచనలలో చోటు చేసుకొనరాదు.

(శ్రీ.. స.. ప్రే.ప్ర.పు.225)

(చూ॥ కస్తూరి)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage