అసలు ఉపనిషత్తులనుండే భూగోళిక: జ్యోతిష: అర్థ శాస్త్రములునూః స్కందః శివ, గరుడ మున్నగు 18 పురాణములునూ తాంత్రిక మాంత్రిక, భక్తి, జ్ఞాన, కర్మయోగములునూ మహా ఋషులచే లోకమునకు అందింపబడినవి. వేదోపనిషత్తులే సనాతన మతములు. ఇందులో ఒక విచిత్రము, ఇతర మతములవలే మన భారతదేశమున మతస్థాపకులు కనుపించరు. ఆ కనుపించని మతగురువే; స్థాపకుడే, జ్ఞానస్వరూపుడగు ఈశ్వరుడు. అతడే మన ప్రవక్త, అతని అనుగ్రహమును పొంది అతని ఆంశలో ఐక్యమైన మహాఋషులే మత ప్రవక్తలు. కాని మానవనైతిక ధర్మములు క్షీణించుటచేతనే, మన భారతదేశమున పెక్కుచోట్ల ఈశ్వరుడు మానవ రూపమున ప్రవక్తగా మద్భవించుచున్నాడు. ఈ సత్యజ్ఞానమును మానవుడు ఉపనిషత్తుల ద్వారానే తెలిసికొన సాధ్యమగును.
(ఉ.వా.పు.6/7)||