ప్రేమయే నిజమైన భక్తి. దైవ ప్రేమను పెంచాలి. చిన్న పిల్లల పవిత్ర హృదయాలలో ఈ పవిత్ర ప్రేమ బీజాల నాటాలి. నీతి కథలు బోధించాలి. సత్యవాక్కు పలికించాలి. భారతదేశం అన్ని దేశాలకు
ఆదర్శప్రాయంగా ఉండాలి. విశ్వము అనే విద్యాలయంలో భారతదేశ ప్రధానోపాధ్యాయుడు. అలా భారతదేశాన్ని తీర్చిదిద్దాలి సేవవల్లనే ఇది సాధ్యం. సేవకు మించిన కార్యం మరొకటి లేదు. సేవయే నాయకత్వం వహించాలి. “అందరి ప్రేమించు, అందరినీ సేవించు” - ఇదే నేడు కావలసింది | ప్రేమించటం - సేవించటం, జీవితంలో దైవసాక్షాత్కారానికి ఇదే మార్గం. ప్రేమమతమే మన మతం. శాంతి అనేది భగవంతుడిచ్చే వరం కాదు. అది నీ మాటల పై, చేతలపై ఆధారపడి ఉంది. నీవు ప్రేమగా మా ట్లాడటం అభ్యాసం చేసుకో! నీకు శాంతి లభిస్తుంది. మన శాంతి మన ప్రవర్తనపైనే ఆధారపడి ఉంది. మనకు శాంతి కావాలంటే మన ఆలోచనలు, కార్యక్రమాలు, ప్రవర్తన అన్నీ శాంతియుతంగా ఉండాలి. ప్రేమగా ఉండాలి. (సనాతన సారథి, నవంబరు 2012…440-441)