మానవుని ఉత్తేజపూరితునిగాను, మానవునిగానూ తీర్చిదిద్దేది సేవ. మానసిక భౌతిక శక్తులనూ మానవత్వాన్ని వికసింపజేసి ప్రకటింపజేస్తుంది నిస్వార్థ సేవ. పవిత్ర సేవ అప్రయత్నంగా దివ్యత్వాన్ని అనుభవింపజేస్తుంది. వజ్రం ప్రకాశించాలంటే అనేక - విధాలుగా దాన్ని కోయవలసివస్తుంది. అదేవిధంగా మానవత్వం వికసించి ప్రకాశించాలంటే కొన్ని అత్యవసర సమాజ సేవలలో మానవుడు పాల్గొనాలి. నిజానికి మీ సేవ ప్రపంచానికేమీ అవసరం లేదు. మీరు సేవలు చేయకపోతే ప్రపంచ గమనం ఆగిపోదు. మీ సేవలు మీ వృద్ధికోసమే; మీ మానసిక పరివర్తనకోసమే; నిర్మలత్వం సంపాదించటం కోసమే. సేవవలన అనేకత్వంలోని ఏకత్వం గుర్తింప బడుతుంది; ఐకమత్యం అభివృద్ధి అవుతుంది. ఐకమత్యం నిర్మలత్వానికి దారితీస్తుంది. నిర్మలత్వం దివ్యత్వాన్ని అందుకొంటుంది. కనుక, ఐక్యత - పవిత్రత - దివ్యత్వం ఈ మూడింటి సమష్టి సరళ స్వరూపమే మానవత్వం. ఈ అన్నిటికి నిస్వార్థ సేవలు అత్యవసరం. పవిత్ర నిస్వార్థ కర్మలద్వారానే మానవత్వం దివ్యత్వాన్ని అందుకొంటుంది.
“పరోపకారార్థం ఇదం శరీరమ్” శరీరం వచ్చింది స్వార్థ స్వప్రయోజనానికి కాదు. మనో బుద్ధులను తమ నిమిత్తం ఉపయోగించినట్లే పరులకోసం కూడా ఉపయోగ పరచాలి. అప్పుడవి పవిత్రతను సంతరించుకొంటాయి. స్వార్థ పదార్థాలు రెండింటితో కూడినవి నిస్వార్ధ కర్మలు. కనుక స్వార్థాన్ని మనం పూర్తిగా విసర్జించనక్కరలేదు. స్వార్థంవలె పరార్థాన్ని కూడా ప్రీతితో అనుభవించాలి. మనో బుద్ధులను అందులో లగ్నం చేయాలి..!
సాఫల్యానికే సమర్పణ
ప్రతి కార్యానికి మనం కొంత సమర్పణ చేయాలి. ఐతే ఇది ప్రపంచానికా? భగవంతునికా? సమాజానికా? సమర్పణ మన కార్యసాఫల్యానికి మాత్రమే. ఏమి సమర్పణ చేయాలి? ప్రతి కార్యంలో మానవుడికి అడ్డు వచ్చే పెనుభూతం అహంకారం. కనుక అహంకారాన్ని సమర్పణ చేయాలి. అహంకార త్యాగంవలన ప్రతి కార్యం పవిత్రమవుతుంది. అహంకారం ఉన్నంతవరకు మానవుడికి ఆత్మతత్త్వానికీ దివ్యత్వానికి సన్నిహిత సంబంధం ఏర్పడదు. అహంకారం ఉన్నవాడు ఆత్మతత్త్వం అర్థం చేసుకోలేడు, ఆనందం అనుభవించలేడు. కనుక, ఏ కార్యంలో ప్రవేశించినా మొదట అహంకారం వదులుకోవాలి. అహంకారం అష్టవిధాలైనా అవేవీ శాశ్వతాలు కావు. మానవుడికి అహంకారం అజ్ఞాన స్వరూపం. అహంకారం నిర్మూలనం అయినప్పుడే సేవలో మనకు నడుం వంగుతుంది. అహంకారం ఉంటే నడుం వంగదు, తల వంచము. ఏనాడు నడుం వంచి, తల వంచి పని చేస్తామో ఆనాడు అహంకారం దానంతటదే పారిపోతుంది. సేవలో పాల్గొనేవాడు ముందు అహంకారాన్ని త్యాగం చేయాలి.
నియమ పాలనం
“భజ సేవాయామ్” అన్నారు. విష్ణుస్వరూపమైన విశ్వాన్ని మనం సేవించాలి. విశ్వం విష్ణుస్వరూపం. భక్తి అంటే కేవలం భజనలు, పూజలు, వ్రతాలు కావు; సేవ. విశ్వరూపుణ్ణి సేవించాలి. ప్రతి మానవునిలోని దివ్యత్వాన్ని గుర్తించి అర్చించాలి. సేవలే పూజలుగా, భజనలుగా - భావించాలి. అప్పుడే అనేకత్వంలో ఏకత్వ దర్శనం ప్రారంభమవుతుంది. అంటే, అహంకార నిర్మూలనంతో పరిశుద్ధ భక్తి ప్రారంభమవుతుందన్నమాట. భక్తి అభివృద్ధివలన క్రమశిక్షణ వస్తుంది. నియమ పాలనం అభ్యాసమవుతుంది. నియమం లేకుండా ఏ కార్యమూ చేయలేము. నియమ రాహిత్యం చాలా ప్రమాదం. మన జీవితమే నియమబద్ధం. అలాకాక నియమాలులేక హద్దులు దాటితే శరీరం రోగమయం అవుతుంది. శరీర ఉష్ణోగ్రత మోతాదుగా ఉంటేనే ఆరోగ్యం . తగ్గినా హెచ్చినా ప్రమాదమే కదా! రక్తపోటు, గుండె కొట్టుకోవడం కూడా నియమంగా నడవాలి. మన కన్ను, ముక్కు చెవి మొదలైన అన్ని అవయవాలు నియమానుసారంగా పనిచేస్తున్నాయి. జీవనమే నియమబద్ధం. కనుక ఆధ్యాత్మిక రంగంలో కూడా నియమాలు చక్కగా పాటించాలి. ఈ నియమాలు ఒకరికి ఒకటి, వేరొకరికి వేరొకటి ఉండకూడదు. సేవలు వేరు, స్థానాలు వేరుగా ఉండవచ్చు. కానీ ఉద్దేశాలు ప్రమాణాలు అని ఒకే స్థాయిలో ఉండాలి.
సాయి సంస్థవారు ఎక్కడికి వెళ్ళినా వినయంగా, విధేయంగా పెద్దలను గౌరవిస్తూ, రోగులకు చక్కగా ఆప్యాయంగా సేవలు చేస్తూ ప్రేమతత్త్వాన్ని ప్రకటిస్తూ రావాలి. మనం విదేశాలకు వెళ్ళినా, పొరుగూళ్ళు వెళ్ళినా, బజారులో నడుస్తున్నా, సభలకు వెళ్ళినా, పట్టణాలకు వెనా మన నడవడిక, ప్రవర్తన, క్రమశిక్షణ, నియమపాలన మన వెన్నంటి నీడవలె జంటగా ఉండాలి. మనలను చూచి “వీరు సత్యసాయి సంస్థకు చెందినవారు” అని కొత్తవారు గుర్తించేటట్లుండాలి. స్థానాలను బట్టి, వ్యక్తులను బట్టి మన నియమపాలనం మారకూడదు. అది నిత్యం మనలో నిలిచిపోవాలి. ………
ఏ పని చేసినా ఆత్మసంతృప్తిగా చేయండి. ఉదాహరణ: డాక్టర్లు రోగులను చూస్తున్నారు. ఎందుచేతనంటే ఇదొక రకమైన సేవ కనుక. సేవ అంటే | బాధపడేవారికి ఆ బాధనుండి విముక్తి కలిగించటం. ఇది చేస్తున్నానా లేదా అని విచారణ చేసుకోవాలి. డాక్టరు రోగిని అన్నివిధాలుగా చక్కగా పరీక్షించి, “అన్నీ బాగున్నాయి కానీ నీ హార్టు ఎని లార్జ్ అయింద”ని చెబితే తాను చేసినది |సేవకాదు, బాధించినవాడవుతాడు. నిజమైన డాక్టరు అలా అనరాదు. అనకుండా దానికి తగిన నివారణోపాయాలు చెప్పి వాడికి ఉత్సాహం తగ్గకుండా చూడాలి. అలాకాక | అపాయం అని చెప్పావు అనుకో! తర్వాత నీవెంత చేసినా "వాడి మనోవ్యాధి కుదరదు. కనుక, రోగికి ముందు - మనశ్శాంతి చేకూర్చే మాటలే చెప్పాలి..
ధ్యానం కూరేది కాదు, ఊరేది!
ఇప్పుడు మానవులకు వచ్చే అధిక వ్యాధులకు కారణం | మానసిక విశ్రాంతి లేకపోవటమే. మనస్సుకు విశ్రాంతి - ధ్యానంవల్ల వస్తుంది. ధ్యానం చాలా అవసరం. ఈ ధ్యానం 5 గురువులు బోధిస్తేనో, గ్రంథాలలో చదివితేనో వచ్చేది. ఉ - కాదు. ధ్యానం అనేది బయట నుండి కూరేది కాదు; లోపల ఊరేది! దాని పై విశ్వాసం కలిగినప్పుడు మాత్రమే ధ్యానం - కుదురుతుంది. ముందు మనం విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఈ విశ్వాసంతో ఎవరికీ బాధ కలుగకుండా చూచుకోవాలి. డాక్టర్లు రోగులలో ఆత్మవిశ్వాసం కలిగించాలి. నవ్వుతూ మాట్లాడాలి. వాళ్ళ బాధలు వినాలి. తగిన ధైర్యం చెప్పాలి. ఈ వ్యాధివలన భయంలేదని మరీమరీ చెప్పాలి. ని ఉత్సాహపరచాలి. రోగి డాక్టరు ముఖం చూస్తుంటాడు. కనుక, ఏమాత్రం అధైర్యం కనపరచరాదు. డాక్టర్ ముఖకవళికలతో కూడా రోగి ఆరోగ్యవంతుడు కావచ్చు, ఆరోగ్యవంతుడు రోగి కావచ్చు.
సర్వవ్యాప్త దివ్యత్వ భావన
డాక్టర్లు పవిత్ర భావంతో, పవిత్రమైన నడవడికతో లై, ఉండి పవిత్రమైన ఆలోచనలు అభివృద్ధి చేయాలి. ఇందుకు ఆధ్యాత్మిక మార్గం ఒక్కటే సరియైనది. ఆధ్యాత్మికం అనేది ది. ఒక మతం కాదు. ఆధ్యాత్మికం అనేది అందరియందు సమానంగా ప్రకాశిస్తూండే దవ్యశక్తి. దీని ఉద్దీపనకు భగవత్ ప్రీతి కావాలి. (స.సా.నం 2012 పు.437/439)
ప్రేమకు ప్రేమే ఫలం
నేడు దేశం అల్లకల్లోలంగా ఉంది. మనం నియమ పాలన అనే పవిత్ర భావాన్ని దేశంలో వ్యాపింపజేయాలి. కేవలం బోధించి, గ్రంథాలు ప్రచురించి ప్రయోజనం లేదు; చేసి చూపించాలి. అదే నిజమైన సేవ. మనల్ని సమాజం ప్రతి క్షణం అడుగడుగునా గమనిస్తోంది. కనుక, మొదట మనం మంచిది అనేది నిర్ణయించుకొని దైవత్వంవైపు పురోగమించాలి. మంచినే వినాలి. మంచినే చూడాలి. మంచి ఆలోచించాలి. మంచిని పెంచుకొని మంచితనాన్ని ప్రపంచానికి పంచి పెట్టాలి. సేవ పదార్థం కోసం కాదు; పరార్డంకోసం సేవ చేయాలి
ప్రేమకోసం మనం ప్రేమించాలి. ప్రేమకు మూడు సుగుణాలున్నాయి.
1. ప్రేమకు భయం లేదు.
2. ప్రేమ ఇచ్చుకొనేదేకాని పుచ్చుకొనేది కాదు.
3. ప్రేమకు ఫలం ప్రేమేకాని మరొకటి కాదు.
ప్రేమ ఉన్నచోట ద్వేషం ఉండదు. ప్రేమ నిస్వార్థమైనది. ప్రేమవద్ద ద్వైతభావమే ఉండదు. ద్వైతం అనగా “నాది నీది” అనే భావం. ఇది ఉన్నచోటే ద్వేషం, భేదభావం అశాంతి ఉంటాయి. ప్రేమ ఉంటే శాంతి లభిస్తుంది అయితే, నీకూ శాంతికీ మధ్యలో ఒక కోరిక వచ్చి కూర్చుంటుంది. ఈ కోరిక పోతేకాని నీకు శాంతి లభించదు. ఐ వాన్ట్ పీస్ (నాకు శాంతి కావాలి) అంటావు ఇక్కడ ఐ (నేను) అనే అహంకారము, వాన్ట్ (కావాలి అనే కోరిక రెండూ తొలగించినప్పుడే పీస్ (శాంతి) నీకు లభిస్తుంది. అహంకారము, కోరిక ఈ రెండే శాంతికి అడ్డుగా వచ్చి చేరినాయి. ఈ అడ్డు పోవాలి. అప్పుడు నీకు శాంతి లభిస్తుంది..