అహం భావన క్రిందకు దింపుతుంది సోహం భావన పైకి తీసుకు వెళుతుంది.
(శ్రీ.స.ది.పు. 4)
మన నిత్య జీవితములో ఉచ్చ్వాస నిశ్వాసములు జరుగుతున్నాయి. మనము గాలిని పీల్చుకొను సమయము లోపల సొ అని, విడుచు లోపల హమ్" అని "సోహమ్” అగుచున్నది. ఈ రెండింటి ఏకత్వములోపల, నిజమైన "ఓంకారము" ఉంటున్నది. సోఅనే అక్షరములోపల హమ్ అనే అక్షరముల లోపల ఉండినటువంటి అంతరార్థమును మనము గుర్తించుకొంటే? "సోహం" అదే నేను. అది కూడా తత్ త్యం ఆసి" ఈ మూడు అక్షరములలో ఉండినటువంటిది ఏకాక్షరమని చెబుతున్నాము."ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ". అనగా ఏకాక్షరం బ్రహ్మ. ఒకే అక్షరం అంటున్నామే, ఇది ఏవిధముగా ఒక అక్షరమవు తుంది? సోహం... ఇందులో సాలోక్య సారూప్య సామీప్య, సాయుజ్యములకు సంబంధించి నటువంటి ‘స కారముమైనస్ అవుతుంది. ఎప్పుడీ స కారము మైనస్ అవుతుంది? జాగ్రత్తను మరచి నిద్రావస్థలో నిలిచినప్పుడు జాగ్రత్త యొక్క మంచి చెడ్డలను మనము విస్మరించి నప్పుడు, ఈ సా అనే శబ్దము లోపల, స కారముమైనస్ అయిపోయి కేవలం
ఓ అవుతుంది. హమ్ అనే నిశ్వాసం లోపల హ కారం మైనస్ అవుతుంది. జాగ్రత్తలో ఉండినంత వరకే స కార హా కారములు, ఈ ఓం కారములో లీనమవుతూ ఉంటాయి. ఈ జాగ్రత్తను విస్మరించి, గాఢ నిద్రలో ఉండినప్పుడు ఈ ఏ కార హు" కారములు రెండూ అంతర్థానమవుతాయి. కనుక "సా" అనే అక్షరములో స కారము పోయినప్పుడు ఓ అవుతుంది. హమ్" అనే విశ్వాసంలోపల "హ కారము పోయినప్పుడు మ్ అవుతుంది. " ఓ +మ్" - "ఓమ్" అయిపోయింది. స కారము, హ కారము, రెండూ చేరినప్పుడు "సోహం" అయిపోయింది. ఈ ‘స కారము, హ కారము రెండూ పోయినప్పుడు "ఓమ్" అవుతుంది. అనగా జాగ్రదవస్థలో ఉండినంతవరకు మానవుడు ఈ ప్రాకృతమైన జీవితంలో లీనమైపోయి, తద్వారా "ఏకాక్షరం బ్రహ్మ" అనే సత్యాన్ని మరచిపోతున్నాడు.
(శ్రీ భ.ఉ.పు.115/116)
(చూ: అమృతపుత్రులు, చదువు. దాసోహం, నేను, హనుమంతుడు)