స్టడీ సర్కిల్సు (Study Circles) గురించి నా సలహా ఇది - ఎంత విలువైనవైనను విచక్షణలేని గ్రంధపఠనమునాకిష్టములేదు. బహుళ గ్రంథ పఠనము (పరిచయము) మనస్సును కలవరపరచును. అది కుతర్కములకు, అహంకారమునకు దారితీయును. మీరు చదివిన విషయములలో కనీసము ఒకటి రెండైనను ఆచరణలో పెట్టవలెనని నేనాశింతును. అదియునుకాక, పుస్తకము కేవలము మార్గదర్శి, గుఱుతు సంభమని జ్ఞప్తియందుంచుకొనవలెను. గ్రంథపఠనతో జీవనయాత్ర సమాప్తి చెందినట్లు కాదు. అది మొదటి మెట్టు మాత్రమే. ఆచరణ కోసము చదవవలెను. చదువుట కొరకు కాదు. అలమార్లలో, గూళ్ళలో ఉన్న అనేక మందుసీసాలెట్లు వ్యక్తి యొక్క శారీరక రుగ్మతను వ్యక్తపరచునో, అట్లే అనేక పుస్తకములు మానవుని మానసిక రుగ్మతను తెలియజేయును. అందుచే భజనకు ముందుకాని, తర్వాతకాని పుస్తకములను చదువుట, కొన్ని కొన్ని భాగములు చదువుట అనవసరము. అట్టిపని వేరే సమయములలో చేయుట ఉత్తమము.
(శ్రీ.స.సూ. పు.101/102)