"రమణీ శిరోమణుల్ రావచ్చు పోవచ్చు
శాశ్వతమైనది సత్యమొకటె
రాజ్యభోగములెన్నొ రావచ్చు పోవచ్చు
శాశ్వతమైనది సత్యమొకటె
భ్రాతలు బంధువుల్ రావచ్చు పోవచ్చు
శాశ్వతమైనది సత్యమొకటే
లోకమందు అధికార భోగముల్ రావచ్చు పోవచ్చు
శాశ్వతమైనది సత్యమొకటే
సరససన్మార్గ పత్రంబు తెలియజెప్పి
అమృతము అదియె సకల సౌభాగ్యమందు
భువిని సత్యంబె యరయ సౌభాగ్యమందు"
(శ్రీ.. డి.2000పు.25)