‘సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనంతమైన జ్ఞానమే బ్రహ్మము. అదే సత్యం అదే నిత్యం. జ్ఞాన విజ్ఞానములు సర్వము. అతని పోత్తే. ఇట్టి దైవత్వము నుండి శబ్ద స్వరూపమైన ఆకాశము ఉదయించింది. ఆకాశము నుండి వాయువు వాయువునుండి అగ్ని, అగ్నినుండి జలము, జలము నుంచి పృధిని ఆవిర్భవించినవి. పృధివినుండి ఓషదులు, ఓషధులనుండి అన్నము, అన్నము నుండి పురుషుడు ఉద్భవించారు. ఏతావాతా బ్రహ్మ పురుషుల సంబంధము అవిచ్ఛినము. పురుషుడు అన్న స్వరూపుడు. అన్నమయ శరీరము నుండి సూక్ష్మాతి సూక్ష్మములైనప్రాణము, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ జీవితములు ఆవిర్భవిస్తూ వచ్చినవి.
(సా.పు. 481/482)
(చూ|| మంత్రము, మంత్రవర్ణిక మేవచ, స్వరూపలక్షలము)