సర్వ నామ ధరం శాంతం
సర్వరూపధరం శివం
సచ్చిదానంద రూపం అద్వైతం
సత్యం శివం సుందరం!
"సర్వ రూప ధరం శాంతం
సచ్చిదానంద రూపం అద్వైతం
సత్యం శివం సుందరం"
(శ్రీ.ఏ.96 పు.25)
ఈ సమావేశంలో మొదట కస్తూరికి, తిరుమలాచారికి శాలువాలు కప్పి ఆశీర్వదించాను. వారు నా జీవిత చరిత్రను ఇంగ్లీషులో. తెలుగులో సత్యం శివం సుందరం అనే పేరుతో రచించారు. నా జీవితంపై ఇలా పుస్తకం ప్రచురించటం నేను ఎందుకు ఇష్టపడ్డానా అని కొందరు ఆశ్చర్యపడవచ్చు. నేను అన్ని మంచి పనులకు ఇష్టపడతాను. అటువంటప్పుడు దీనికి మాత్రం యెందుకు ఇష్టపడను? భక్తుల ప్రార్థనలను నెరవేర్చటానికి వీరు ఈ పుస్తకాలను వ్రాయటానికి నేను అంగీకరించాను.
(శ్రీ.వ. 61-62 పు. 139)
మీలో కొందరికి నా జీవిత చరిత్ర ఎందుకు ప్రచురించటమూ అనే ఆశ్చర్యం కలిగి ఉండవచ్చు. నా జీవిత చరిత్ర తెలుసుకోవాలని ప్రార్థించిన నా భక్తుల ప్రార్థనను ఆలకించి వారిని వ్రాయటానికి అనుమతించాను. రమయతి ఇతి రామః’
రమింపచేసే వాడు రాముడు. అంటే ఆనందాన్ని కలుగచేసేవాడు. భక్తుని సంతోషమే భగవంతునికి ఆనందం. భగవంతుని ఆనందమే భక్తునకు గొప్ప బహుమానం.
పుస్తకానికి పెట్టిన ఈ పేరు పూర్తిగా అర్థవంతమై ఉన్నది. నేను మీ అందరి హృదయాలలోనూ అంతర్గతంగా ఉన్నానన్న విషయాన్ని ఈ పుస్తకం తెలియచేస్తుంది. మీఅందరిలోనూ ప్రాథమికంగా ఉన్న మూలతత్వాన్ని సత్యమే" నని గుర్తుంచుకోండి. అందుచేతనే మిమ్మల్ని ఎవరైనా అబద్ధాలకోరు అంటే మీకు చాలా కోపం వస్తుంది. నిజమైన నీవు "అబద్ధం" తెలియనటువంటి అమాయకుడవు. నిజమైన నీవు ఆరోపణను స్వీకరించలేవు. నిజమైన నీవు సచ్చీ లానికి, మంచి తనానికి, సంతోషానికి, ఆనందానికి, పవిత్రతకు ప్రత్యేకమైన శివం అయివున్నావు. నువ్వు శివం కాని శవం కాదు. అది నిత్యమైనది, శుభమైనది. ఆనందకరమైనది. అటువంటప్పుడు మంచి అని చెప్పు కోవలసిన నిన్ను చెడ్డగా చిత్రీకరిస్తే ఎలా సహించ గలుగుతావు? నీవునిజమైన సౌం దర్యానికి ప్రతీకపు. అందవిహీనంగా ఉన్నారని ఎవరైనా అంటే నీవు సహించవు. ఒప్పుకోవు. నీవు నిజానికి ఆత్మవు కాబట్టి ఏ వాహనానికి (దేహమునకు) కల లోపాలను నీకు అంటగడితే నీవు సహించలేవు"
(శ్రీస.ప్రే. .పు.237)
(చూ॥ కస్తూరి, దూపాటి తిరుమలాచారి, నేను)