స్త్రీలు - విద్య

స్త్రీలకు కానీ పురుషులకు కాని విద్య అవసరము. ఐతే స్త్రీలకు సరియగు మార్గముల విద్య గరుపవలెను. సంస్కృతి గల స్త్రీలు లోకమునకు ధర్మదేవతలు. ఆరీతిగా సద్విద్యాసంపన్నురాలుగా చేయుటకు తల్లి దండ్రులు కూడా తోడ్పడవలెను. స్త్రీలకు కొన్నింటియందు స్వేచ్ఛనివ్వరాదు. అట్టి వినాశమొనర్చు విద్యలందు స్త్రీలకు స్వేచ్ఛపట్ల నేననుకూలుడను కాను; వాటిని నేనంగీకరింపను. వారిని ఆదర్శ స్త్రీలుగా తయారుచేయు విద్యాసంస్కృతులను చేకూర్చవలెను. పరిపూర్ణ స్వేచ్ఛ ధర్మనాశనమగును. అట్టి దానివలన తమ్ముతాము పాడుచేసుకుందురు. విచక్షణాహీనమైన కలసిమెలగుట విధ్వంసకారక ఫలితమునకు గొంపోవును.

 

అట్టి విద్యావంతులగు స్త్రీలు ఆనాడుకూడను అనేకులుండియూ వారిధర్మమును వీడక, ఆత్మానందమును లక్ష్య మందుంచుకొని తిరిగిరికదా? విద్య అనేక ఆధారమున పెరగ వలెను. సులభ. సావిత్రి, అనసూయ, గార్గి, నాలాయనివంటి పతివ్రతలు, మీరావంటి భక్తులు, చూడాలవంటి యోగినులు మన భారతదేశమునందే జనించి, ధర్మమును ధర్మవిద్యను నిలిపిరి కదా? ఒకానొక సమయమున సులభ తన విద్యాశక్తిచే ఆత్మ విచారమును గూర్చి ప్రసంగించినా జనకుడు సహితము స్థంభించి పోయెను. అట్టి మహా ఘనాత్మలు, వారి పవిత్రతలు, వారల భక్తిజ్ఞానములతో కూడిన నడవడికల మూలముననే నేటికిని మన భారతదేశ స్త్రీల హృదయములలో యింతమాత్రమైనను సరళత, దైవికత్వమును, వినమ్రత గలదు; కలవారు కూడా కలరు.

 

అధునాతన కాలపు స్త్రీలు వారినుండి యావేశము కొనవలెను; అట్టి స్త్రీ రత్నములు గడిపిన జీవితములను ఇప్పటివారు గడుపవలెను. హిందూ స్త్రీయొక్క స్వేచ్ఛాదర్శయెప్పుడును ధార్మిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి యుండవలెను. ఎంతటి నవీన విద్యలయందు త్తీర్ణులై యుండినను, ఆత్మార్థమును మరువక ఆంతర్దృష్టిని బలపరుచు వేదాంత తత్వము యొక్క జేత్రవిద్య నవలంబింపవలెను. అట్టి విద్యలేని స్త్రీ అండలేని బండ వంటిది. చూడు! అట్టి విద్య నవలంబించిన సులభవంటి బ్రహ్మవాదినుల భారతేదశము ఉత్పత్తి జేసెను. చదివిన పండితులు విద్వాంసులు సహితము వారి వద్దకు త్తేజమునకై వచ్చెడివారు.

 

దేనిపై సమస్తము ఆధారపడునో అట్టి ప్రధాన అంశమే మనగా, దేశము యొక్క పురోభివృద్ధిగాని, సమాజముయొక్క పురోభివృద్ధిగాని, జాతి యొక్క సద్విద్యపై సంపూర్ణముగా ఆధారపడినది. స్త్రీ ఆత్మతత్త్వ విద్యనే దేశమును తన స్వాభావిక స్థితికి లేవనెత్తగలదు. స్త్రీలకు త్ శీ పోషణసద్గుణ పోషణగల విద్యలు గరపిన, యావత్తు దేశమునకు క్షేమమును, శాంతిని గలిగించిన వారగుదురు. నా టి భారత దేశము యొక్క పవిత్రతకు నేటి అపవిత్రతకు ఆనాటి శాంతి సుఖములకు నేటి అశాంతి అక్రమములకూ స్త్రీల ధర్మమే కారణము. ఆనాటి ధర్మవిద్య ఈనాటి అధర్మ విద్య రెండింటివలన కలిగినవే యుగమార్పులు. కానీ యుగమార్పులన్న భూమి ఆకాశములు మారవు, మారలేదు. మారబోపు.

 

నేటి విద్యలు పేరుకు విద్యలేకాని ప్రవర్తనలకు ప్రతిష్టలకు అవిద్యలు: ఇవి ధర్మ విద్యలు కావు. ఆత్మానందమును అనుభవించి, ఆత్మార్థమును గ్రహించి, ఆచరించి అనుగ్రహమును పొందిన, అదియే ఆనాటి విద్యకు తగిన పట్టము. నైతిక కృషి ఆత్మజ్ఞానము, సాధు స్వభావము, పునరుద్ధరణ, ఉత్తమ నడవడి, పరిశుభ్రరీతులు, ఇంద్రియ శిక్షణ, ఘనమగు దివ్య సుగుణముల పెంపొందించుటలో ప్రాధాన్యత. వీటిని సాధించిన వారు అనుగ్రహమను పట్టమును అలంకరించు చుండిరి; నేడట్లుకాక, కొన్ని పుస్తకముల కంఠస్థ మొనరించిన పట్టమును (డిగ్రీని) పొందవచ్చును! నేటికాలపు విద్యలలో పై చెప్పిన ఘనమగు విద్యాశిక్షణ నొందజాలరు.

 

స్త్రీకి సక్రమ మార్గమున విద్య గరుపవలెను. దేశీయ సమస్యల నవగాహనము చేసికొనగలిగి యుండవలెను.అట్టి దేశమునకుగాని సమాజమునకుగాని తన సహాయమును సేవను తన జీవితమున కామోదిత నియమములకు అనుగుణమగు విధమున నొసంగవలెను. ఏదేశమైనను నిర్మింపబడవలెవన్న స్త్రీలు ఉచితమగు తగు సంస్కృతి గలిగియుండవలెను. భావివంశము నేటి మాతపై ఆధారపడియుండును. నేటి వంశము పురాతన మాతపై ఆధారపడి ఉండకుండుటే, నేటి అధర్మ ఆక్రమములకు కారణము! గడచినది గడచిపోయినది. వచ్చుదాని నయినమా వర్ధిల్లు వేయుటకు వనితలు పురాతన మాతల ప్రవర్తనలను పాటించవలెను.

 

కాలమునకై ననూ మాతలు దేశమునకు వెన్నెముక వంటివారు; హృదయమువంటివా, శ్వాసమువంటివారు. ప్రపంచనాటకమునకు మాతలే ప్రాధాన పవిత్రపాత్ర వహించవలెను. ఆమెనే జాతినీ, నీతిని నిర్మించుటకు దృఢపడవలెను.స్త్రీయే ప్రపంచపు భావిపౌరులగు బిడ్డలను తర్ఫీదొనర్పవలెను. బిడ్డలకు నైతిక, ధార్మిక శిక్షణలు నొసంగవలెను. తల్లి ధార్మిక అగుటవలన బిడ్డలు ధార్మికులగుదురు, తల్లి నైతిక విద్యను పొంది యుండుటవలన బిడ్డలు నైతిక స్వభావులు కాగలరు. కాన దేశ నాశనమునకు, దేశపోషణకు స్త్రీల యొక్క విద్యయే కారణము, ప్రవర్తనయేపాశము.

 

దీనికి పెద్దలైన తల్లిదండ్రులు కూడనూ మూలమని చెప్పవచ్చును. నేటి విద్యార్థులు చూతమా, సంస్కార గంధమే వారియందు గనుపించదు. ఆత్మార్థమే వారికి హాస్యముగా కనుపించును. భాషలు నేర్చుట, వేషములు మార్చుట, నేటి భారత సాంప్రదాయమైనది. ఇది వాస్తవిక సంస్కృతి కాదు. నేటి విద్యావంతులు గృహకృత్యములు చేయజాలని వారై యున్నారు. గృహమనగా ఒకహోటలు వలె భావించుచున్నారు. సదా వంటవారిపై, దాసీల పై ఆధారపడియున్నారు. నేటి విద్యావంతురాలగుస్త్రీ కేవలము గృహము చిత్ర బొమ్మ యైనది; అట్టి స్త్రీలు భర్తకు బరువైన గుండువంటివారే. అంతేకాక వారు అమిత జబ్బులకు గురియగుచున్నారు. ఇంటి యందలికఠిన కార్యములలో భాగము వహించకుండినందున తినటము నిద్రించుటవలన సోమరితనము బలిసి, జీర్ణశక్తి చచ్చి, కడకు శరీరమును జీర్ణముచేయుటకు, చంపుటకు, సిద్ధమగుచున్నారు.

 

నేటి స్త్రీలు స్వేచ్ఛను ఆవిరళముగా వినియోగించు కొనుటచే ధర్మగ్లాని ఆవరించినది. చదివిన విద్య వివేకముతో సద్గుణ ప్రవర్తనలను సత్ శీల అభివృద్ధికి వినియోగించక, కేవలము లోకభోగానందములే ప్రధానములని తలంచి, కపట స్వేచ్చ ననుపుగొనుటచేత తమను తాము హింసించుకొనుచున్నారు. ఉద్యోగములు చేయుట, డిగ్రీలు పొందుట, వివేక విచక్షణ లేక సర్వులతో సంచరించుట, పెద్దలన్న వినయము, పాపమన్నను చెడు కార్యమన్నను భయము; మంచి, దైవము అన్న విశ్వాసము ఇవి లేకుండుట; పతి కీలుబొమ్మలవలె చేతి యందుంచుకొని ఆడించటము; తన యిచ్చారతులను అనుభవించడము: గడచిన తప్పునకు పశ్చాత్తాపము పడకుండటము: ఇవి విద్యలయొక్క స్వరూపములా? కాదు కాదు! ఏనాటికిని కాదు! అవిద్య యొక్క విపరీత స్వరూపములు, ఆకారమును నిర్మూలమొనర్చు అహంకారములు, ఇవి విద్యలకే చెడ్డ పేరు సంపాదించును. ఇకస్త్రీ ధర్మమునకు హానిచేయవా? పతి గృహమును సతి పవిత్రమైన మందిరముగా తలంచిన సర్వ విద్యలు భవనమందే సంప్రాప్తమగును. దానికి మించిన ప్రదేశము యేదేశమందు నూ లేదు. అందుకనే ఒక మహాభక్తుడు క్రింది విధమున తెలిపెను.

 

"తల్లి కైవడి అన్ని తప్పుల సైచి

పుణ్యమొసగు సతుల దేవాలయంబు:

వలదన్న ద్గ్రంథ పఠన కష్టములేక

పలుశాస్త్రములు నేర్పు పాఠశాల:

శ్రమలేక తమయంత సర్వంబు సమకూర్చు

ఆనందమొసగు విహారభూమి;

అజహరాదులనైన ఆడింపగల భవ్య

మహిమ చేకూర్చు సన్మంత్రశాల!

సతుల యనురాగ సర్వార్థ సాధనంబు

కాంత సౌభాగ్య కల్యాణ కల్పకంబు

ప్రణయ త్యాగోపదేశ వైరాగ్యశాల:

పతిగృహంబె సతులకు పాఠశాల!" –

 

విద్యావంతులగు స్త్రీలు మానవసంఘమునకు తమ సామర్థ్యము, అభిరుచి. మానసికతత్వము, ఆభిలాష స్వభావము. విద్యయొక్క అంతస్థులను పట్టి వారి జీవిత విధానధర్మము, లేదా సుప్రతిష్టిత నియమముల కనుగుణమగు, లేదా సంపూర్తి పొందియగురీతిగ ఎట్టి ప్రయోజనకారక సేవనైననూ చేయనగును. తమపైనను తమ కుటుంబము పైననూ, తల్లిదండ్రుల పైననూ, అమర్యాదను లేదా అపకీర్తిని, తమ శీలమునకు మచ్చనుగాని తెచ్చుదాని వారొనర్చరాదు. శీలము లేనిదిస్త్రీలు బ్రతికి యుండియు చచ్చినవారుగా పరగణింప బడుదురు.

 

వారు లోకమున సంచరించినపుడు చాల జాగ్రత్తగా, మెలకువగా నుండవలెను. పురుషులతో ఆధిక ప్రసంగము, అత్యధికముగ కలసి మెలగుటలు త్యజించవలెను. భర్తయొక్క కీర్తిమర్యాదలకు భర్తయొక్క ఉత్తమ గౌరవములకు కళంకమురాని ప్రవర్తనలో మెలగుటే విద్య యొక్క వివేకసారము. అందుకనే, “చదువు కొన్నందుకు సార్థకమేమన సద్గుణ నడకలే సారము" అని మహనీయు లనుచుందురు.

 

నేటి విద్యలు నేర్వకూడదనియు, నేటి సమాజములో తిరుగాడకూడదనియు నే శాసించుటలేదు. చదువు చదివినను, యే సమాజములో తిరిగినను, సద్గుణములతో పాటు సత్ ప్రవర్తన, సత్ ప్రవర్తనలతోపాటు సమాజములు, సమాజములతోపాటు సచ్చీలము, సచ్చీలముతో పాటు సనాతన ధర్మ విచారణలు ఉండిన చదువేమి చేయును, సమాజమేమిచేయును? చదువులు సమాజములు చెడుపు లేదు; అని చెడుపుటకు రాలేదు. వాటిని పొందువారి గుణతత్వములను బట్టి అవి వారికి తోడ్పడునే కానీ, స్వయముగా వాటికి చెడుపుస్వభావములు లేవు. పిల్లితన పిల్లలనూ, యెలుకలనూ రెండింటినీ ఒకే నోటితోనే పట్టుకొనును. కాని యెలుకలను చంపివేయును, తన పిల్లలను రక్షించును. ఇది నోటి యొక్క స్వభావమా? కాదు తన గుణము స్వభావముచే నోటిచే కార్యము చేసినది. అట్లే విద్య వివేకమార్గమున అభివృద్ధి పరచి పరోపకారమూ చేయును; పరమార్థమును విచారించును, పరతత్వమునూ వెతికించును; పరమహంసలనూ చూపించును. అట్లుకాక విద్యను అవివేకమార్గమున అజ్ఞానదృష్టలో చూచిన అనాచార, అక్రమ, అన్యాయ, అసత్యమును బల పరచి అనేక చెడుమార్గముల నడిపించి మానవజీవితమునే మసి చేయును. ప్రేమనే విషముగా చేయును.

(. వా,పు 35/42)

(చూ|| స్త్రీ యొక్క ధర్మము)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage