"The one you think you are is SAT. The one others think you are is CHIT, The one you are really are is ANANDAM". కనుక యీ సత్. చిత్, ఆనంద మనేటటువంటిది మానవుని యొక్క హక్కు. మానవునియొక్క స్వభావము. మానవని యొక్క సహజత్వము. యిలాంటిదానిని మనము చక్కగా గుర్తించుకొనలేక పరులను దూషించడము, పరులను కొంతవరకు హేళన చేయడము యీ విధమైనదానిలో మనము పోయి వారి పాపము లను మనము పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. "పరిహాసము పాపనాశనం" అన్నారు. ఇతరులను పరిహాసం చేయకూడదు. ఇతరులను ఏమాత్రం కూడను మనం నొప్పించడానికి ప్రయత్నం చేయకూడదు. ఒక వేళ ఇది ప్రాకృత మైనటువంటి దోషంగా మీకు కనిపించనపుడు మంచి మాటలచేత వారిని సవరించడానికి ప్రయత్నంచాలి.
(సా.3.1. పు.19)
(చూ॥ నాదబిందుకళలు)