"చదువుకొనుట ధనార్జన కొరకే కాదు.The end of education is character. The end of knowledge is love.కనుకనే మనము ఈ జ్ఞానము (Knowledge) ను పెంచుకోవాలి. నిజమైనటువంటి విద్య (Education) ఏమిటంటే శీలము (Character) కనుక మనము శీలము (Character) పెంచుకోవాలి. పెంచుకోవలసినది ధనము కాదు. ధనము యొక్క గుణమేమిటి? Money comes and goes; but Morality comes and grows. డబ్బు వస్తుంది పోతుంది, నీతిగనుక వస్తే అది క్రమంగాపెరుగుతుంది. కనుక ఈ పవిత్రమైన విషయమును అర్థం చేసుకొని, మీ ప్రవర్తనలను, భావములనుసరిదిద్దుకోటానికి ప్రయత్నించి, ఆదర్శవంతమైన, నవజీవితమును అనుభవించి, ఇతరులకు అందించాలి."
(ఉదయం ప్రత్యేక అనుబంధం పు.5)