స్వామి బాల్యంలో తన స్నేహితునితో "నీకు నాకు మధ్య స్నేహము కలకాలము ఉండాలంటే మనం ఈ రకంగావస్తువులను ఇచ్చి పుచ్చుకోకూడదు. అవసరములోనున్న ఒక వ్యక్తి ఎవరైనా ధనవంతుని వద్ద నుండి ఏదైనా తీసుకున్నప్పుడు దానిని తిరిగి ఎలా చెల్లించాలా అనే ఆందోళన అతని మనస్సులో బాధిస్తూంటుంది. అలాగే ఆ వస్తువును ఇచ్చిన వారి మనస్సును వారు చేసిన "దానము" మలిన పరుస్తుంది. నిజమైన స్నేహము అనేది రెండు హృదయముల మధ్య ఉండాలి. ఇచ్చి పుచ్చుకునే పద్ధతి మీద మనం స్నేహబంధము పెంచుకున్నప్పుడు తీసుకునే వ్యక్తి కించపడగా, ఇచ్చిన వ్యక్తి గర్వపడతాడు. అటువంటి స్నేహము తొందరలోనే విచ్చిన్నమవుతుంది. అందువలన నీవు పంపిన దుస్తులను నేను తీసుకోవడం లేదు. ఈ ఉత్తరంతో వాటిని త్రిప్పి పంపిస్తున్నాను.."
(దై.ది..పు. 307)
(చూ|| ఆనందము. క్షేత్రము)