దైవాన్ని కూడా ప్రియమైన స్నేహితునిగా భావించు కున్నప్పుడు మన భావాలన్ని స్పష్టంగా చెప్పుకోవటానికి ఒక ధైర్యం వస్తుంది. త్యాగరాజు దైవాన్ని తన పాత స్నేహితునిగా భావించి గౌరవ మర్యాదలు ఏమియు పాటించక ఏకత్వంగా పోయాడు. గౌరవ మర్యాదలు యివ్వడానికి అనేకత్వంగా, భిన్నత్వంగా భావించలేదు. భగవంతుని తన యింటికి రారా యని పిలుస్తాడు.
రారా మాఇంటి దాకా (రామ)
రామ రారా మా ఇంటి దాక !!రా
రఘవీర సుకుమారనే మొక్కెద !! రా!!
దశరథ కుమార నన్నేలుకోరా నే తాళలేరా॥ రా!!
పిలిచి, పిలిచి, విసుగెత్తినది.
ఎంత వేడుకొందు ఓ రాఘవా
పంతమేలరా ఓ రాఘవా !!ఎం!!.
అప్పటికి అతని తృప్తి లేదు
మారు బలక్కకున్నవేమిరా! (రామ)
మామనోరమణా !!మా !!
జారచోర, భజన చేసితిరా
సాకేతా, సదన !!మా!!
మరికొంత సేపు చూశాడు రామ చంద్రుని గూర్చి నిన్ను నేనెందు వెదకుదురా! ఓరామా!!ని!
ఈ విధంగా అనేక మంది భక్తులు, భగవంతుని స్నేహ భావము చేత ఏక వచనంగా సంబోధించి, ఆరాధనలు సలిపారు.
(సా.పు.99/105)