అసలు లోకంలో ఈనాడు విజమైన స్నేహితులు లేనే లేరు. ఎవరీ స్నేహితులు? ఎన్నాళ్ళు? కాలేజీలో చదివేంత వరకే కదా! ఆ తరువాత?‘ఎవరికి వారే యమునా తీరే . నీ తండ్రి మంచి పదవిలో ఉండి, నీ జేబులో పైకం దండిగా ఉన్నంత కాలం ఆందరూ హలో, హలో అంటూ దగ్గర చేరతారు. తండ్రి రిటైరైన తరువాత,జేబులు ఖాళీ అయిన తరువాత కనీసం "గుడ్ బై”” చెప్పేవారు కూడా ఉండరు. మైత్రి అనగా త్రికరణ శుద్ధిగా స్నేహం చేయడం. అలాంటివారున్నారా ఈ లోకంలో? లేనే లేరు. నిజమైన స్నేహితు డెవరు? God is the only real friend. God is the only true friend. సర్వకాల సర్వావస్థలయందు నీవెంట జంట కంట ఉండే భగవంతుడే నీ నిజమైన మిత్రుడు. ఇంకెవ్వరూ కాదు. Tell me your company, I shall tell you whatyou are. నీ స్నేహితులను బట్టి నీవెలాంటివాడవో చెప్పవచ్చును. వీరాధివీరుడైన, శూరాధిశూరుడైన కర్ణుడంతటివాడు దుష్టసాంగత్యంచేత దుష్ట చతుష్టయంలో ఒకడై అపకీర్తి పాలైనాడు. ఇంకబంధువులెవరు? మరణానంతరం ఎవరికి ఎవరు? అందరూ మధ్యలో వచ్చి మధ్యలో విడిపోయేవారే కదా! కదిలేపోయే మేఘములవంటివారే కదా! మరణానంతరం బంధువులు వాకిలి వరకే ,ఆలుబిడ్డలు వల్లకాటి వరకే. నీవెంట ఉండేది. జగద్బంధువైన దైవమొక్కడే. నీవైనా ఎంతకాలం? నీవు పుట్టక ముందు, నీ జీవిత కాలంలో, నీ మరణానంతరం కూడా ఉన్నాడు దైవం. ఆ దైవమే సత్యం, నిత్యం. ఆ దైవాన్ని విశ్వసించు, అనుసరించు కారణం? ఏనాటికైనా నీవు ఈ లోకాన్ని విడువవలసిందే.
Catch hold of God with your right’ hand. It is always the right thing to do. Catch hold of the world with your left hand. One day or the other it has to be "left". ఈ ప్రపంచాన్ని నీవు ఏనాటికైనా విడువవలసిందే దైవాన్ని గట్టిగా పట్టుకో. అదే మంచిది (Right)
(స.సా.ఫి.99 పు.52)
(చూ! నరజన్మ)