సత్యభామ కృష్ణుని బంగారంతో తూచడానికి ప్రయత్నించి విఫలమైంది. కాని రుక్మిణి కేవలం తులసి దళంలో కృష్ణుని తూచగలిగింది. భగవంతుడు బంగారమునకు చిక్కడు. ధవమునకు దొరకడు. గుణమునకు మాత్రమే చిక్కుతాడు. ప్రేమకు లొంగుతాడు. కనుక ప్రేమను పెంచుకోండి. మీ అభిష్టములన్ని నెరవేరతాయి. ద్వేషించకండి. ఇదియే మీకు సరియైన ఆదర్శము. ఇది ముఖ్యమైనటువంటి సందేశము. ప్రేమస్వరూపులు మీరు కావాలి. ప్రేమానందమును మీరు అనుభవించాలి. ఇదియేఈనాడు నేను మీకు యిచ్చేటటువంటి గొప్ప Gift. నాదగ్గర ఉన్నటువంటి స్వంత ఆస్తి అది ఒక్కటే.
ప్రేమనే..... ప్రేమనే.... కనుక ఆ ప్రేమను మీకు ఎంతైనా యిస్తాను. కడపటికి దేహమునైనా మీకు యిస్తాను. మీరు ఆనందంగా జీవించండి! ఆదర్శవంతులుగా బ్రతకండి! అప్పుడే నాకు నిజమైన ఆనందం కలుగుతుంది. ఏదిచ్చినా నాకు ఆనందం కాదు. మీ ప్రేమనే నాకు ఆనందం, నాప్రేమనే మీకు సౌభాగ్యం. కనుక మీరు దానిని కాపాడుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
(శ్రీ డి.2000పు.8)